JOBS : నిర్మల్, నిజామాబాద్ లలో 58 వేల వేతనంతో కాంట్రాక్టు ఉద్యోగాలు

నిజామాబాద్ (సెప్టెంబర్ – 21) : తెలంగాణ రాష్ట్రబీమా వైద్య సేవలు శాఖ క్రింద ఇఎస్ఐ డిస్పెన్సరీ – నిర్మల్, డిస్ట్రిక్ట్ నిర్మల్ ఇఎస్ఐ డిస్పెన్సరీ, శివాజీనగర్, ఇఎస్ఐ డిస్పెన్సరీ, నిజామాబాద్ మరియు ఇఎస్ఐ డయాగ్నస్టిక్ సెంటర్, నిజామాబాద్ నందు దిగువతెలిపిన ఉద్యోగాలలో తాత్కాలికంగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక సంవత్సరంపాటు పని చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

మల్టీ జోన్-1/ జోన్ – 2 నుండి ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు
డౌన్లోడ్ చేసుకొని, పూర్తిచేసిన తమ దరఖాస్తులకు విద్యార్హతల ధ్రువపత్రాలను జతచేసి, పోస్టు ద్వారా లేదా స్వయంగా “ది జాయింట్ డైరెక్టర్, బీమా వైద్య సేవలు, ఇఎస్ఐ హాస్పటల్ క్యాంపస్, నర్సంపేట రోడ్డు, లేబర్
కాలనీ, వరంగల్, పిన్ నెం. 506013″ వారికి సమర్పించాలి.

దరఖాస్తు గడువు సెప్టెంబర్ 25 – 2023 సాయంత్రం 5.00 గం. వరకు కలదు

దరఖాస్తు ఫారం కింద ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://nizamabad.telangana.gov.in/

https://nirmal.telangana.gov.in/#