Home > JOBS > CONTRACT JOBS > ECIL CONTRACT JOBS – 1,100 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు

ECIL CONTRACT JOBS – 1,100 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు

BIKKI NEWS (JAN. 12) : హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో 1, 100 జూనియర్ టెక్నీషియన్ (గ్రేడ్ – 2) పోస్టుల భర్తీకి ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తులు కోరుతూ (contract jobs in ecil hyderabad) ప్రకటన విడుదల చేసింది.

ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 16వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి పరీక్ష లేకుండా ఐటీఐ మార్కులు, రిజర్వేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

ట్రేడుల వారీ ఖాళీలు:

ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 275
ఎలక్ట్రిషియన్-275,
ఫిట్టర్- 550.

అర్హతలు : ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రిషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్ లో ఐటీఐ ఉత్తీర్ణత. ఏడాది అప్రెంటిస్ తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 16/01/2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ళు సడలింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.22,528/-

ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు గడువు: 16/01/2024.

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://www.ecil.co.in/