విజయవాడ (సెప్టెంబర్ – 27) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు 2023 (contract employees regularization bill – 2023) కు ఆమోదం తెలిపింది. దాదాపు పదివేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణ కానున్నారు.
2014 జూన్ 2 కంటే ముందు సర్వీస్ లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించింది.