హైదరాబాద్ (మే – 04) : తెలంగాణ రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఈరోజు నిరుద్యోగులు వేసిన కేసును విచారించిన హైకోర్టు నిబంధనలకు లోబడి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని తెలిపింది.
రెగ్యులరైజేషన్ వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై వేసవి సెలవుల తర్వాత విచారిస్తామన్న కోర్టు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది.
ఇటీవల ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో నెం. 38 నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.