Home > JOBS > RTC JOBS > RTC JOBS – కాంట్రాక్టు పద్దతిలో 1,201 డ్రైవర్‌ పోస్టులకు నోటిఫికేషన్

RTC JOBS – కాంట్రాక్టు పద్దతిలో 1,201 డ్రైవర్‌ పోస్టులకు నోటిఫికేషన్

BIKKI NEWS (NOV. 25) : Contract Driver Jobs in TGSRTC. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన టీజీఎస్‌ఆర్టీసీలో 1201డ్రైవర్‌ పోస్టులకు సైనిక సంక్షేమశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణ సైనిక సంక్షేమ శాఖలో డ్రైవర్‌ పోస్టులకు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.

Contract Driver Jobs in TGSRTC

ఎంపికైన వారికి నెలకు రూ.26వేల వేతనం, రోజువారీ అలవెన్స్‌ రూ.150 చెల్లిస్తారు.

అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సైనిక సంక్షేమశాఖ సూచించింది.

మాజీ సైనికుల్లో హెవీ డ్యూటీ లైసెన్స్‌ కలిగి, 18 నెలల డ్రైవింగ్‌ అనుభవం ఉన్నవారు దరఖాస్తులకు అర్హులు.

వయస్సు 58 కన్నా తక్కువగా ఉండాలి. ఎత్తు 160 సెం.మీ కంటే తక్కువగా ఉండకూడదు.

ఆసక్తి గల మాజీ సైనికులు దరఖాస్తును 30వ తేదీలోపు porsb-ts@nic.in లేదా emprsb-ts@nic.in కు మెయిల్‌ చేయాలని డైరెక్టర్‌ సైనిక్‌ వెల్ఫేర్‌ ప్లేస్మెంట్‌ ఆఫీసర్‌ తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు