నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ : మీ ఓటు ఉందో చూసుకోండి

హైదరాబాద్ (ఆగస్టు 21) : ఓటర్ల జాబితాలో పేరు లేనివారితోపాటు ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండే వారంతా ఓటర్లుగా నమోదు చేసు కోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు తమ చిరునామాను మార్చుకునేందుకూ వీలు కల్పించింది. ఈ మేరకు ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ను విడుదల చేసిన ఎన్నికల సంఘం.. ముసాయిదా ఓటర్ల జాబితాను ఈరోజు (సోమవారం) ప్రకటించనున్నది.

ఈ జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడానికి, మార్పులు, చేర్పులు చేసుకోవడానికి సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 26, 27తోపాటు సెప్టెంబర్ 3, 4న గ్రామాలు, వార్డుల్లో క్యాంపులను నిర్వహించనున్న ఎన్ని కల సంఘం.. సెప్టెంబర్ 28 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి, అక్టోబర్ 4న తుది జాబితాను ప్రకటించనున్నది.

ఈ జాబితాతోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు చేర్పులకు అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చే
అవకాశం ఉన్నది. ఓటర్ల జాబితా సవరణను విజయవంతం చేయడంతోపాటు ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరుతూ ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించారు.

మీ ఓటు ను ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు

★ రాష్ట్రంలో 3.06 కోట్ల మంది ఓటర్లు

ప్రస్తుతం తెలంగాణలో 3.06 కోట్ల మంది ఓటర్లుళఉన్నట్టు ఎన్నికల కమిషన్ లెక్కలు చెప్తున్నాయి. వీరిలో 1.53 కోట్ల మంది పురుషులు, 1.52 కోట్ల మంది మహిళలు, 2,133 మంది ట్రాన్స్ జెండర్లు, 15,368 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 18-19 ఏండ్ల వయసువారు 4.72 లక్షల మంది, 80 ఏండ్లు పైబడినవారు 4.79 లక్షల మంది, వికలాంగులు 4.98 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు.

★ ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్

  • ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన: ఆగస్టు 21
  • దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు: సెప్టెంబర్ 19
  • అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన పూర్తి: సెప్టెంబర్ 28
  • తుది ఓటర్ల జాబితా ప్రకటన: అక్టోబర్ 4