హైదరాబాద్ (ఆగస్టు – 21) : తెలంగాణ రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆలకించి సానుకూలంగా స్పందించారు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. Telangana employees will get New PRC committed IR and EHS
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు శుభవార్తలు చెబుతారని అన్నారు. ఉద్యోగులకు నూతన పిఆర్సి కమిటీ ఏర్పాటుతోపాటు ఐఆర్ మరియు నూతన హెల్త్ స్కీములను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటారని తెలిపినట్లు సమాచారం.