CBSE SCHOLARSHIP : బాలికలకు ప్రతిభా స్కాలర్‌షిప్

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 24) : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2023 ప్రకటన విడుదల చేసింది. (cbse single girl child scholarship 2023). తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా అమ్మాయి ఉంటే ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

సీబీఎస్ఈ పదో తరగతిలో పాసై ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు: విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి.
విద్యార్థిని CBSE లో పదో తరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్ఈ
అనుబంధ పాఠశాలలో పదకొండవ తరగతి, పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 60శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500 కంటే మించకూడదు.

స్కాలర్షిప్ విలువ : ఉపకారవేతనానికి ఎంపికైన
విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్
చేయించుకోవాలంటే, విద్యార్థిని కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.
విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500 చొప్పున అందిస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : 18-10-2023.

సీబీఎస్ఈ పాఠశాలల దరఖాస్తు ధ్రువీకరణ తేదీలు: 25.09.2023 నుంచి 25.10.2023 వరకు.

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://www.cbse.gov.in/cbsenew/scholar.html