INDvsAUS : టీమిండియా స్కోర్ 399

ఇండోర్ (సెప్టెంబర్ – 24) : INDIA vs AUSTRALIA జట్ల మద్య జరుగుతున్న రెండో వన్డే లో టీమిండియా బ్యాట్స‌మన్ శ్రేయస్ అయ్యర్ (105), శుభమన్ గిల్ (104) సెంచరీలు, కెఎల్ రాహుల్ (52), సూర్య కుమార్ యాదవ్ (72) మెరుపులతో భారీ స్కోర్ సాదించింది.

శ్రేయస్ అయ్యర్ కి మూడో అంతర్జాతీయ వన్డే సెంచరీ కాగా, శుభమన్ గిల్ కి ఇది ఐదో అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం విశేషం.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు బౌలింగ్ భారత బ్యాట్స్‌మన్ దాటికి తేలిపోయింది. గ్రీన్ – 2, జంపా, హెజిల్‌వుడు, అబాట్ తలో వికెట్ తీశారు. గ్రీన్ పది ఓవర్లలో 103 పరుగులు ఇవ్వడం విశేషం

సూర్య కుమార్ యాదవ్ కామేరూన్ గ్రీన్ వేసిన 44 ఓవర్లో మొదటి నాలుగు బంతులకు నాలుగు సిక్సర్లు కొట్టాడు (surya 4 sixes in 4 balls)

ఈరోజు ఆటలో భారత జట్టు 18 సిక్సర్ లు కొట్టడం విశేషం. అలాగే అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో 3,000 సిక్సర్ లు కొట్టిన మొదటి టీమ్ గా టీమిండియా నిలిచింది.

వన్డేలలో ఆస్ట్రేలియా పై టీమిండియా కు ఇదే (399) అత్యుత్తమ స్కోర్ కావడం విశేషం.