INDvsAUS : టీమిండియా ఘనవిజయం

  • సిరీస్ కైవసం చేసుకున్న భారత్

ఇండోర్ (సెప్టెంబర్ – 24) : INDIA vs AUSTRALIA జట్ల మద్య జరుగుతున్న రెండో వన్డే లో టీమిండియా 99 పరుగుల తేడాతో ఘనవిజయం సాదించింది. దీంతో 2 – 0 తేడాతో సిరీస్ గెలుచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాట్స‌మన్ శ్రేయస్ అయ్యర్ (105), శుభమన్ గిల్ (104) సెంచరీలు, కెఎల్ రాహుల్ (52), సూర్య కుమార్ యాదవ్ (72) మెరుపులతో 399 /5 భారీ స్కోర్ సాదించింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు బౌలింగ్ భారత బ్యాట్స్‌మన్ దాటికి తేలిపోయింది. గ్రీన్ – 2, జంపా, హెజిల్‌వుడు, అబాట్ తలో వికెట్ తీశారు. గ్రీన్ పది ఓవర్లలో 105 పరుగులు ఇవ్వడం విశేషం.

ఆసీఫ్ బ్యాట్స‌మన్ లలో వార్నర్ (53), అబాట్ (54) పరుగులతో రాణించారు. ఆసీస్ 217 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్ – 3, జడేజా – 3, ప్రసిద్ కృష్ణ – 2 వికెట్లు తీశారు.

సూర్య కుమార్ యాదవ్ కామేరూన్ గ్రీన్ వేసిన 44 ఓవర్లో మొదటి నాలుగు బంతులకు నాలుగు సిక్సర్లు కొట్టి (surya 4 sixes in 4 balls)

ఆసీస్ మీద భారత్ కి ఇదే అత్యధిక స్కోర్ (399), అలాగే అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో 3,000 సిక్స్ లు కొట్టిన మొదటి జట్టు టీమిండియా..