TGT JOBS :బీటెక్ అభ్యర్థులకు TGT అవకాశం ఇవ్వండి హైకోర్టు

హైదరాబాద్ (మే – 30) : టీజీటీ మ్యాథమెటిక్స్, సైన్స్ పోస్టులకు బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల రిక్రూట్మెంట్ బోర్డ్ లను (btech students are eligible for tgt posts ) ఆదేశించింది.

బీఎస్సీ మ్యాథమెటిక్స్ అభ్యర్థులతో సమానంగా బీటెక్ వారిని చూడాలని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంజ్ గతంలో ఇదే అంశంపై తీర్పు ఇచ్చిన విషయం తెలిసింది. ఏప్రిల్ 5న ఇచ్చిన టిజిటి మ్యాథమెటిక్స్ పోస్టుల నోటిఫికేషన్ లలో తమను పరిగణలోకి తీసుకోవాలని పలువురు బీటెక్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.