BSc Nursing Admissions : కాళోజీ వర్శిటీ నోటిఫికేషన్ విడుదల

వరంగల్ (ఆగస్టు – 20) : తెలంగాణ రాష్ట్రంలో BSc Nursing, PBBSc Nursing Admissions డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) 2023 – 24 విద్యా సంవత్సరాలనికి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ప్రకటన జారీ చేసింది.

BSc Nursing కోర్స్ 4 – సంవత్సరాలు, Post Basic BSc Nursing కోర్స్ 2 – సంవత్సరాలు కాలవ్యవది కలిగి ఉంటుంది.

దరఖాస్తు గడువు : ఆగస్టు 20 ఉదయం 8.00 గంటల నుంచి ఆగస్టు 31 సాయంత్రం 5.00 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ తెలిపింది.

విద్యార్హతలు : BSc (N) : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో పాటు, TS EAMCET 2023 ర్యాంక్ సాదించి ఉండాలి.
జనరల్ కేటగిరీ – 53,257, SC, ST, BC, &PWD – 63,908, OC – PWD – 58,582 బ్యాంకు లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

PBBSc (N) : ఇంటర్మీడియట్ & GNM కోర్సు పూర్తి చేసి ఉండవచ్చు.

◆ వయోపరిమితి : BSc (N) : 02 – 01 – 2007 కంటే ముందు జన్మించి ఉండాలి.

PBBSc (N) : 31 – 12 – 1978 నుండి 02 – 01 – 2003 మద్య జన్మించి ఉండాలి.

◆ దరఖాస్తు ఫీజు : 2,500/- (SC, ST – 2,000/-)

ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం మెరిట్ జాబితా ప్రకటిస్తామని, మరిన్ని వివరాలకు వెబ్సైట్ సందర్శించాలని కోరింది.

◆ వెబ్సైట్ : https://www.knruhs.telangana.gov.in/