ADMISSIONS : అగ్రి మహిళా కాలేజీల్లో అడ్మిషన్లు

హైదరాబాద్ (సెప్టెంబర్ 12) : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ గురుకుల విద్యాలయ సంస్థలు ఆధ్వర్యంలో నడపబడుతున్న వనపర్తి, కరీంనగర్ బీసీ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీల్లో అగ్రికల్చర్ హానర్స్ కోర్సులో ప్రవేశాలకు (Bsc Agriculture admissions in BC DEGREE GURUKULAS 2023) సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదు.

ఈ ఏడాది అగ్రిసెట్ (agricet 2023) లో అర్హత సాధించిన విద్యార్థినులు ఈ ప్రవేశాలకు అర్హులు అని తెలిపారు. ర్యాంకు, రిజర్వేషన్ ప్రాతిపదికన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని స్పష్టంచేశారు.

వివరాలకు 040-23328260. నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

వెబ్సైట్ : https://mjptbewreis.telangana.gov.in