DAILY CURRENT AFFAIRS IN TELUGU 11th SEPTEMBER 2023

BIKKI NEWE : DAILY CURRENT AFFAIRS IN TELUGU 11th SEPTEMBER 2023

1) ఈజిప్ట్ లో జరుగుతున్న ‘బ్రైట్ స్టార్ట్ 23’ నావిక విన్యాసాలలో భారత తరఫున పాల్గొంటున్న యుద్ధ నౌక పేరు ఏమిటి?
జ : ఐ ఎన్ ఎస్ సుమేద

2) సేలం సాగో అనే ఉత్పత్తి ఏ రాష్ట్రం నుండి ఇటీవల జియోగ్రాఫికల్ ఇండెక్స్ ట్యాగ్ ను పొందింది.?
జ : తమిళనాడు

3) భారత ప్రభుత్వం ఏ సంస్థతో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ కోసం ఒప్పందం చేసుకుంది.?
జ : అడోబ్

4) ది గ్రీన్ హైడ్రోజన్ పైలెట్స్ సదస్సు ఇటీవల ఏ నగరంలో నిర్వహించబడింది.?
జ : న్యూఢిల్లీ

5) అధ్యాపకులలో బోధనా నైపుణ్యాలను పెంచడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : మాలవ్య మిషన్ ట్రైనింగ్ టీచర్

6) ఐసీసీ అసోసియేట్ దేశాల తరఫున అంతర్జాతీయ టి20లో 100 వికెట్లు సాధించిన మొట్టమొదటి బౌలర్ ఎవరు.?
జ : నట్టాయ బుకతామ్

7) ట్రాన్స్ జెండర్లకు పెన్షన్ మరియు ఓబిసి కేటగిరీని ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏది.?
జ : జార్ఖండ్

8) W అనే మహిళ ఫ్యాషన్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అనుష్క శర్మ

9) ‘వరుణ 2023’ అనే పేరుతో నావిక విన్యాసాలను ఏ రెండు దేశాలు చేపట్టాయి.?
జ : భారత్ & ఫ్రాన్స్

10) శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్ 2022 సంబంధించి 12 మందిని ఎంపిక చేశారు. అందులో తెలుగువారు ఎవరు.?
జ : మద్దుకీ సుబ్బారెడ్డి

11) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ ఎవరు?
జ : శుభోద్ కుమార్ సింగ్

12) ప్రఖ్యాత ‘జర్మన్ ఫీస్ ప్రైజ్ 2023’ ఎవరికి దక్కింది.?
జ : సల్మాన్ రష్దీ

13) లిబియా దేశంలో ఏ తుఫాను కారణంగా ఇటీవల 2,000 మంది మరణించారు.?
జ : డేనియల్ తుపాను

14) అక్కినేని జీవన సాఫల్య పురస్కారం 2023 కోసం ఎవరికి ఎంపికయ్యారు.?
జ : కిమ్స్ వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, సుజాత దంపతులు

15) ఓకే సీజన్ లో మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్లు నాలుగు సార్లు గెలుచుకున్న ఒకే ఒక ఆటగాడు ఎవరు.?
జ : నోవాక్ జకోవిచ్

16) అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు అందుకున్న ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : విరాట్ కోహ్లీ (277 ఇన్నింగ్స్ లలో)

17) ప్రపంచంలో మొట్టమొదటి క్లోనింగ్ గొర్రెపిల్ల డాలిని సృష్టించిన ఏ శాస్త్రవేత్త మరణించారు.?
జ : ఇయాన్ విల్మట్ (స్కాట్లాండ్)

18) దివ్యాంగుల నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణ ఇవ్వడానికి ఏ పోర్టల్ ను కేంద్రం ప్రారంభించింది.?
జ : పీఎం దక్ష్ పోర్టల్