చరిత్రలో ఈరోజు అక్టోబర్ 04

★ దినోత్సవం

  • అంతర్జాతీయ జంతు దినోత్సవం.
  • ప్రపంచ అంతరిక్ష వారం.

★ సంఘటనలు

1855: ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చొరవ మరియు నాయకత్వంలో వితంతు వివాహ చట్టం ప్రవేశపెట్టబడింది
1934: అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది.
1957: సోవియట్ యూనియన్ మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌ని విజయవంతంగా ప్రయోగించింది. ఇక్కడ నుండే అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య అంతరిక్ష పోటీ ప్రారంభమైందని నమ్ముతారు.
1992: సమాజ్‌వాదీ పార్టీ , భారతదేశ రాజకీయ పార్టీ, స్థాపించబడింది.
2006: వికీలీక్స్ ప్రారంభించబడింది

★ జననాలు

1911: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (మ.1998)
1912: కుంకలగుంట సైదులు, మద్రాసు, విజయవాడ ఆకాశవాణిలో నాదస్వరవిద్వాంసుడు.
1920: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది. (మ.2013)
1943: రసరాజు ,(రంగేనేని సత్యనారాయణ రాజు)కవి , సినీ గీత రచయిత .
1957: గాజుల సత్యనారాయణ, తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష రచయిత.
1977: సంఘవి, కన్నడ, తెలుగు సినిమా నటి.

★ మరణాలు

1904 : ఫ్రెడెరిక్ ఆగస్టు బార్తోల్డి, అమెరికా దేశంలో ఉన్న స్టేట్యు ఆప్ లిబర్టీ శిల్పి, ప్రాన్స్ లో బెల్ఫోర్ట్ లో చెక్కిన సింహం విగ్రహము విగ్రహ శిల్పి (జ.1834) .
1947: మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1858)
2015: ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (జ.1934)