BNYS ADMISSIONS : ఇంటర్ మార్కులతో అడ్మిషన్లు

విజయవాడ (ఆక్టోబర్ – 09) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి BNYS COURSES admissions లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది.

◆ సీట్ల వివరాలు :

  1. కేర్ యోగా, నేచురోపతి మెడికల్ కాలేజీ (బాపట్ల): 50 సీట్లు
  2. పతంజలి మహర్షి నేచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజీ,
    గుంతకల్: 50 సీట్లు

అర్హతలు : 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)

వయసు : 31-12-2023 నాటికి 17 సంవత్సరాలు నిండాలి

ఎంపిక : ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా

దరఖాస్తు ఫీజు : ఓసీ/ బీసీలకు రూ.2950. ఎస్సీ/.ఎస్టీలకు రూ. 2360.

ఆన్లైన్ దరఖాస్తులు: 12.10.2023 వరకు స్వీకరిస్తారు.

వెబ్సైట్: http://drysruhs.edu.in/index.html