YASASVI SCHOLARSHIP 2023 : యశస్వి ప్రవేశ పరీక్ష రద్దు

  • అకడమిక్ మార్కుల ఆధారంగా స్కాలర్‌షిప్ కు ఎంపిక

హైదరాబాద్ (సెప్టెంబర్ – 29) : ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందించేందుకు దేశ వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించతలపెట్టిన యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా (PM YASASVI SCHOLARSHIP TEST 2023 CANCELLED) ప్రవేశపరీక్షను రద్దు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ(NTA) ప్రకటించింది.

ఈ సంవత్సరం ప్రవేశ పరీక్ష బదులు 8, 10 తరగతుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను స్కాలర్షిప్లకు ఎంపిక చేస్తామని వెల్లడించింది. ఆయా తరగతుల్లో 60 శాతానికిపైగా మార్కులు పొందిన వారు అర్హులను, నేషనల్
స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపింది.

ఈ స్కాలర్షిప్ కు ఎంపికైన అభ్యర్థులకు 9, 10 వ తరగతి లో 75 వేలు,. 11, 12 తరగతులలో 1,25,000 చొప్పున అందజేస్తారు.

★ వెబ్సైట్ ; https://yet.nta.ac.in/