జీజేసి హుస్నాబాద్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

హుస్నాబాద్ (అక్టోబర్ – 18) : తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. బతుకమ్మ సంబరాలు ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ నల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పువ్వులను దేవతలుగా భావించి పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని తెలుపుతూ తెలంగాణ ప్రజల యొక్క సాంప్రదాయాలను కట్టుబాట్లను సంస్కృతులను బతుకమ్మ పండుగ చాటి చెపుతుందన్నారు. ఆడపడుచులు అందరూ బతుకమ్మ పండుగను భక్తి శ్రద్ధలతో ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటారని తెలిపారు.

అనంతరము మహిళా అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందాలు ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డి.కరుణాకర్ యొక్క పర్యవేక్షణలో జరిగింది.

ఈ కార్యక్రమాల్లో కళాశాల సిబ్బంది డి రవీందర్, ఎస్ సదానందం, బి. లక్ష్మయ్య, కే స్వరూప, కవిత, ఏ సంపత్, జి కవిత, నిర్మలాదేవి, పి. రాజేంద్రప్రసాద్, అధ్యాపకేత్ర బృందం టీ. పద్మ‌, రాములు, టీ. భాగ్యలక్ష్మి, శ్వేత మరియు విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.