REPUBLIC DAY : శాస్ర్తీయ మానవ వాద కేతనం రాజ్యాంగం –

  • అస్నాల శ్రీనివాస్ – తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం.
  • అస్నాల శ్రీనివాస్ రిపబ్లిక్ డే ప్రత్యేక వ్యాసం

BIKKI NEWS : భారత రాజ్యాంగం నాల్గవ భాగం 51A ప్రకరణ ప్రస్తావించిన పదకొండు ప్రాధమిక విధులలొ “వైజ్ఞానిక దృక్పథాన్ని, మానవ జిజ్ఞాసను పరిశోధనా, సంస్కరణ స్పూర్తిని పెంచుకోవడం కీలకమైనది. జాతీయోద్యమ ఆకాంక్షల మేరకు ఆధునిక ప్రపంచంలో భారత్ కు సముచితమైన స్థానం పొందడం కోసం తోలి ప్రధాని నెహ్రూ అవిరళ కృషి జరిపి పటిష్ట పునాదులు వేసాడు. నెహ్రూ తన “డిస్కవరి ఇండియా “పుస్తకంలో వైజ్ఞానిక దృక్పథాన్ని వివరిస్తూ “ఇది ఒక శాస్త్రీయ పద్ధతి, సత్యం మరియు నూతన జ్ఞానం కోసం శోధన, పరీక్ష, మరియు విచారణ లేకుండా ఎదైనా అమోదించకుండా నిరాకరించడం, కొత్త ఆధారాల నేపధ్యంలో మార్చగల సామర్ధ్యం ఉంటుందని తెలియచేసాడు. అంతిమగా విజ్ఞాన శాస్త్రం మానవ జీవనానికి, సంక్షేమానికి తోడ్పడాలని భావించాడు. ప్రజల ప్రగతికి ఉపయోగపడే మౌళిక రంగాలు ప్రభుత్వమే నిర్వహించాలన్న రాజ్యాంగ లక్ష్యం వెలుగులో తన హయాంలోని పంచవర్ష ప్రణాళికలలో యుద్ధ ప్రాతిపదికన భారీగా పాఠశాలలను కళాశాలలను స్థాపించాడు, మానవ ప్రగతి, సమత మమతలకు అవరోధంగా ఉండే సనాతన విలువలను తొలగించటానికి పునరుజ్జీవన భారతావనిని నిర్మించడానికి వైజ్ఞానిక విద్య మహత్తర పాత్ర నిర్వర్తిస్తుందని పశ్చిమ దేశాల అనుభవం ద్వారా గ్రహించాడు. బుద్ధుడు ప్రతిపాదించిన కార్యాకారణ సిద్ధాంతాన్ని ఆవాహన చేసుకున్న నెహ్రూ మతం మనస్సును మూసివేస్తుందని భావోద్వేగం, మూఢత్వం, అసహనాలను ప్రజలలో కలిగిస్తుందని, విద్యాలయాలు శాస్త్రీయ ధోరణులను వివేచనను విద్యార్థులలో నాటడం ద్వారా వైజ్ఞానిక దృక్పథం పురోగతికి మతము అనే అవరోధం క్షీణిస్తుందని సూత్రీకరించాడు.

బుద్ధుడు ప్రతిపాదించిన కార్యాకారణ సిద్ధాంతాన్ని ఆవాహన చేసుకున్న నెహ్రూ మతం మనస్సును మూసివేస్తుందని భావోద్వేగం, మూఢత్వం, అసహనాలను ప్రజలలో కలిగిస్తుందని, విద్యాలయాలు శాస్త్రీయ ధోరణులను వివేచనను విద్యార్థులలో నాటడం ద్వారా వైజ్ఞానిక దృక్పథం పురోగతికి మతము అనే అవరోధం క్షీణిస్తుందని సూత్రీకరించాడు.అస్నాల శ్రీనివాస్

నెహ్రూ 1958 లొ శాస్త్ర సాంకేతిక విధాన రూపకల్పన చేసాడు, హోమి జహంగీర్ భాబా సారధ్యంలో అణుశక్తి కమీషన్ ను స్థాపించాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో స్వయం స్వాలంబన కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఎర్పాటు చేసాడు. భౌతిక శాస్తంలో నొబెల్ గ్రహీత సి వి రామన్, జె సి ఘోష్, శాంతి స్వరూప్ భట్నాగర్ ల సహాకారంతో కౌన్సిల్ అఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ను దేశవ్యాప్తంగా విస్తరింప చేసి అరవైకి పైగా పరిశోధన, ప్రయోగ, ఇన్నోవేషన్ కేంద్రాలను ప్రారంభించాడు. ఇందిరగాంధీ హయాంలో 1970 లో ఎర్పాటైన నేషనల్ కమిటి అన్ సైన్స్ అండ్ టెక్నాలజి ఈ కృషిని మరింతగా కొనసాగించింది. ఈ సంస్థలు ఎరోస్పేస్, మైనింగ్, పెట్రోలియం, పర్యావరణం, వ్యవసాయం, నిర్మాణ రంగాలలో తమ శోధనలను, అభివృద్ధిని కొనసాగిస్తున్నాయి. ఈ డెబ్భై సంవత్సరాల కాలంలో 1500 లకు పైగా నూతన అవిష్కరణలను గావించింది. పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో మెదోక్విలాన్ అనే డ్రగ్ ను, సరస్ అనే చిన్న విమానాన్ని, NM 5 యుద్ధ విమానాన్ని, స్వరాజ్ ట్రాక్టర్లను, త్వరితగతిన పుష్పించే వెదురును, నూతన ముడి చమురు శుద్ధి విధానాలను రూపోందించినది. ప్రపంచంలో తొలి ఐదుభాషల డిజిటల్ లాబ్ ను రూపోందించినది. ఇక్రిసాట్, ఐ ఐ టి లు, ఐ ఐ యమ్ లు వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఎర్త్ మూవర్స్, డైనమిక్స్, ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాంటి ఎన్నో సంస్థలను నెహ్రూ స్థాపించాడు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టి అర్గనైజెషన్ ప్రకారం అత్యధిక పేటంట్లను కలిగి ఉన్న దేశాలలో భారత్ ఏడవ స్థానం పొందినది.

నెహ్రూ 1958 లొ శాస్త్ర సాంకేతిక విధాన రూపకల్పన చేసాడు, హోమి జహంగీర్ భాబా సారధ్యంలో అణుశక్తి కమీషన్ ను స్థాపించాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో స్వయం స్వాలంబన కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఎర్పాటు చేసాడు. – అస్నాల శ్రీనివాస్

నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో సమృద్ధిగా నిధులు పోందిన పరిశోధనా సంస్థలకు తర్వాత కాలంలో కేటాయింపులు తగ్గుముఖం పట్టాయి. జి డి పి లో శాస్త్ర సాంకేతిక రంగాలకు మూడు శాతం కేటాయించాల్సిందిగా ఉండగా గత ఇరవై సంవత్సరాలుగా సగటున 0.7% నిధులను పొందాయి. 2014 మోడి అధికారంలోకి వచ్చాక కెటాయింపులు 0.4% కి పడిపోయాయి. జి డి పి లో అమెరికా 3%, చైనా 2%, ఇజ్రాయెల్, కొరియాలు 4% లు కేటాయిస్తున్నాయి. గత నాలుగేండ్ల మోడి పాలన పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలలో జడత్వం ఆవరించింది. ఒక జంతువు అది విసర్జించే ద్రవ ఘనాల పైన పంచగవ్వ పై జరిగే పరిశోధనకు మాత్రమే అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నది. మానవ నాగరికతా వికాసం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి గుడ్డి విశ్వాసాలను మూఢత్వాన్ని తొలగిస్తూ అపూర్వ శారీరక మేధో శ్రమతో ఆవిష్కరణలు చేసిన భారతీయ, ప్రపంచ శాస్త్రవేత్తల కృషిని అగౌరవ పరిచే సూడో సైన్స్ ధోరణులను వ్యాప్తి చెందిస్తున్నది.

జి డి పి లో శాస్త్ర సాంకేతిక రంగాలకు మూడు శాతం కేటాయించాల్సిందిగా ఉండగా గత ఇరవై సంవత్సరాలుగా సగటున 0.7% నిధులను పొందాయి. 2014 మోడి అధికారంలోకి వచ్చాక కెటాయింపులు 0.4% కి పడిపోయాయి. – అస్నాల శ్రీనివాస్

2019లో పంజాబ్ లోని జలంధర్ లో జరిగిన 106 వ భారతీయ సైన్స్ కాంగ్రెస్స్ ఈ సూడో ధోరణులకు ఆశాస్త్రీయ ప్రసంగాలకు చర్చలకు వేదికగా నిలిచింది. 1974లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ లో సమావేశమైన భారత శాస్ట్రవేత్తల బృందం వ్యక్తిగత మత విశ్వాసాలకు, పురాణ సంబంధ అంశాలకు శాస్త్రీయత విలువను అపాదించకూడదని, శాస్త్రీయ శోధనలలొ వాటికి తావివ్వకూడదని తీర్మానించింది. దీనిని ఉల్లంగిస్తూ సంఘ్ పరివార్ అనుకూల “శాస్త్రవేత్తల “బృందం” 2015 ముంబై, 2016 మైసూరు,2017 తిరుపతి, 2018 ఇంఫాల్,2019 జలంధర్, 2020 బెంగళూరు సమావేశాలను కాల్పనిక గాథల వినోద ప్రధాన వేదికలగా మార్చి ప్రపంచం ముందు నవ్వుల పాలు చేసింది. ఆంధ్రా వర్సిటి విసి నాగేశ్వరరావు జలంధర్ లో మాట్లాడుతూ కౌరవుల కాలంలోనే టెస్ట్ ట్యూబ్ పరిజ్ఞానం ఉందన్నాడు. టెస్ట్ ట్యూబ్ పద్ధతి ద్వారా శిశువును సృష్టించిన భారతీయ మహిళా శాస్త్రవేత్త ఇందిరా అహుజాను, జన్యువును రూపోందించిన నోబెల్ గ్రహీత హరగొబింద్ ఖోరానా కృషిని ఈ ప్రకటన అపహస్యం చేస్తున్నది. రావణుడి కాలంలో వైమానిక శాస్త్రం ఉన్నదని, న్యూటన్, ఐన్ స్టీన్ సిద్ధాంతాలు తప్పని ఎలాంటి సహేతుక ఆధారాలు లేకుండా పేలవ ప్రసంగాలు చేసారు. సత్యపాల్ సింగ్ అనే కేంద్ర మంత్రి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించి దశవతార సిద్ధాంతాన్ని పాఠ్యప్రణాళికలో చేరుస్తామని చెప్పడు. మోడి సంఘ్ పరివార్ చరిత్రతో పాటు సైన్స్ ని కూడా వక్రీకరించి బావోద్వేగ మత రాజకీయాలను అధికారం కోసం ప్రచారం చేస్తున్నది. ప్రధాన స్రవంతి భారతీయ శాస్త్రవేత్తల గుణాత్మక పరిశోధనా పలితాలను పంచుకుని తమ గుర్తింపును పెంచుకోవడానికి దేశీయంగా అంతర్జాతీయంగా తమ కెరీర్ ఎదుగుదలకు తోడ్పడే సైన్స్ కాంగ్రెస్స్ లు ఆ స్పూర్తిని కోల్పోతున్నాయి. ఈ విధంగా జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్స్ లను సర్కస్ లుగా, కాల్పనిక జంతువుల జాతరగా వర్ణించిన నొబెల్ గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ సమావేశాలకు రావడం మానివేసాడు.

సంఘ్ పరివార్ అనుకూల “శాస్త్రవేత్తల “బృందం” 2015 ముంబై, 2016 మైసూరు,2017 తిరుపతి, 2018 ఇంఫాల్,2019 జలంధర్, 2020 బెంగళూరు సమావేశాలను కాల్పనిక గాథల వినోద ప్రధాన వేదికలగా మార్చి ప్రపంచం ముందు నవ్వుల పాలు చేసింది. అస్నాల శ్రీనివాస్

ఏడు ఏండ్ల కాలంలో పార్లమెంట్ లో శాస్త్ర సాంకేతిక అంశాలపై జరిగిన చర్చ అతి స్వల్పం. నిధుల కేటాయింపు అతి కనిష్టం. సాధరణంగా ప్రభుత్వ యూనివర్సిటిలలో సైన్స్ కాంగ్రెస్స్ లను నిర్వహిస్తారు. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ విభాగం ఇచ్చే నిధులను సమావేశ నిర్వహణతో పాటు ఆయా ప్రభుత్వ వర్సిటిలు అదనపు మౌళిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకునేవి. కాని ఉనికిలో లేని జియో విద్యా సంస్థకు వెయ్యి కోట్లు ప్రకటించిన మోడి ఈ కాంగ్రెస్స్ ను కార్పోరేట్ లవ్లీ ప్రోఫెషనల్ యూనివర్సిటిలో నిర్వహించి దాని ప్రచారకర్తగా పని చేసింది. ఇలా రూపంలో, సారంలో మోడి ప్రభుత్వం రాజ్యాంగ లక్ష్యాల ఉల్లంఘనకు పాల్పడుతూ పాలన కొనసాగిస్తున్నది.

సాధరణంగా ప్రభుత్వ యూనివర్సిటిలలో సైన్స్ కాంగ్రెస్స్ లను నిర్వహిస్తారు. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ విభాగం ఇచ్చే నిధులను సమావేశ నిర్వహణతో పాటు ఆయా ప్రభుత్వ వర్సిటిలు అదనపు మౌళిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకునేవి. కాని ఉనికిలో లేని జియో విద్యా సంస్థకు వెయ్యి కోట్లు ప్రకటించిన మోడి ఈ కాంగ్రెస్స్ ను కార్పోరేట్ లవ్లీ ప్రోఫెషనల్ యూనివర్సిటిలో నిర్వహించి దాని ప్రచారకర్తగా పని చేసింది.అస్నాల శ్రీనివాస్

భారత రాజ్యాంగం ప్రవచించిన వైజ్ఞానిక మానవజిజ్ఞాసను ప్రజలలొ పాదుకునేలా పౌరసమాజం తీవ్రంగా కృషి చేయాలి. ప్రభుత్వ విధానాలు అత్యధిక ప్రజలకు మేలును చేకూర్చే విధంగా ఉండాలని చెప్పిన రాజ్యాంగ
“సర్వ సత్తాక ” ప్రజల ప్రగతికి ఉపయోగపడే విద్య వైద్యం శాస్త్ర సాంకేతిక రంగాలను రాజ్యమే నిర్వహించాలన్న, సంపద వికేంద్రికరణ ఉండాలన్న “సోషలిస్ట్”, మత ప్రమేయంలేని “లౌకిక “, సమ్మతి అసమ్మతిని భరించే “ప్రజాస్వామ్య ” లక్ష్యాలను పరిపూర్ణంగా అమలు చేయడం కోసం ప్రజాతంత్ర ఉద్యమం చేపాట్టాల్సిన చారిత్రక భాద్యత మన ముందు స్పష్టంగా కనిపిస్తున్నది. పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల వరకు విజ్ఞానశాస్త్రాన్ని పటిష్టంగా భోధించాలి ఈ ప్రస్థానంలోనే మానవవాద సాంకేతిక భారతదేశం ప్రపంచపటంలో సమున్నతంగా నిలబడుతుంది.