ఉద్యోగ ఉద్యమాల దీప స్తంభం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం – అస్నాల శ్రీనివాస్

  • శిఖర స్థాయిలో పనిచేసిన టి జి ఓ వరంగల్ శాఖ
  • టిజిఓ హన్మకొండ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
    అస్నాల శ్రీనివాస్

  • “యువతరమా నవతరమా ఇదే అదను కదిలి రమ్ము కొంత మంది యువకులు రాబోవు యుగం దూతలు” కవులు చెరబండరాజు, శ్రీ శ్రీ కవితా పంక్తులకు నమూనాగా నిలిచిన టిజిఓ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్

నీళ్లు నిధులు నియామకాల అంశంలోజరుగుతున్న వివక్షతలను తొలగించడం కోసం, మన ఉనికికి జవజీవాలైన సంస్కృతి, భాషల రక్షణ కోసం జరుగుతున్న అవిరామ పోరులో తమవంతు చారిత్రక బాధ్యతను నిర్వర్తించటం కోసం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆవిర్భవించింది.

ఆధునిక తెలంగాణ చరిత్రలో మానవ విమోచన పోరాటాల పరంపరను పరిశీలించినట్లయితే రైతాంగం, చేతివృత్తుల వారు విద్యార్థులు క్రియాశీల పాత్ర పోషించారు. ఉద్యోగ వర్గాల నుండి ప్రజా ఉద్యమాలకు సంఘీభావం అంతంత మాత్రంగానే ఉండేది. ఉద్యోగులు ప్రత్యేకించి గెజిటెడ్ స్థాయి ఉద్యోగులు బదిలీలు, జీత భత్యాల కోసం మాత్రమే పోరాటాలు నిర్వహించేవారు. ఎక్కువగా టీఎన్జీవో నిర్వహించే పోరాట ఫలితాల పై ఆధారపడేవారు. తాము నివసిస్తున్న, తమను ఎదిగించిన సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు గెజిటెడ్ ఉద్యోగులలో ఒక ఉదాసీనత, పట్టింపులేనితనం కనిపించేది.

1998 నుండి మలి దశ ఉద్యమం, జనసభ, మహాసభ, 2001 తెలంగాణ రాష్ట్ర సమితిల ఆధ్వర్యంలో లక్షలాదిగా ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ఉవ్వెత్తున కదులుతున్న వైనం ఒక యువ గెజిటెడ్ ఉద్యోగిలో తీవ్ర ప్రకంపనలు సృష్టించి, వలసపాలకులను ప్రారద్రోలాలి అనే కసిని రగిలించింది. పసి ప్రాయంలో తన తండ్రి 1969 ఉద్యమంలో పాల్గొన్న స్మృతి వెంటాడింది.

తెలంగాణ పోరాటాలతో ఎరుపెక్కిన ఈ నేలలో సాహిత్య విప్లవ వనాలు ఉన్నాయి అని తన గోల్కొండ కథల కవితల పుస్తకాలను వెలువరించిన పాలమూరు సురవరం ప్రతాపరెడ్డిని తన మనో కేతనంలో నిలుపుకొని కార్యాచరణను రూపొందించుకున్న యువ చైతన్య కెరటం విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్. అస్నాల శ్రీనివాస్

ధిక్కారం పై ధిక్కారం, తెంపుగడ్డ తెలంగాణకు గుండెకాయ వరంగల్ జిల్లాలో పరాయిపాలనను, దోపిడీని ఎదిరించిన తన సామాజిక అస్తిత్వ మహా యోధుడు సర్వాయి పాపన్న సాహసాన్ని అవాహన చేసుకున్నాడు. తెలంగి భేలంగి అని తెలంగాణ భాషను అపహాస్యము చేసినప్పుడు తెలంగాణ పోరాటాలతో ఎరుపెక్కిన ఈ నేలలో సాహిత్య విప్లవ వనాలు ఉన్నాయి అని తన గోల్కొండ కథల కవితల పుస్తకాలను వెలువరించిన పాలమూరు సురవరం ప్రతాపరెడ్డిని తన మనో కేతనంలో నిలుపుకొని కార్యాచరణను రూపొందించుకున్న యువ చైతన్య కెరటం విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్.

ధిక్కారం పై ధిక్కారం, తెంపుగడ్డ తెలంగాణకు గుండెకాయ వరంగల్ జిల్లాలో పరాయిపాలనను, దోపిడీని ఎదిరించిన తన సామాజిక అస్తిత్వ మహా యోధుడు సర్వాయి పాపన్న సాహసాన్ని శ్రీనివాస్ గౌడ్ అవాహన చేసుకున్నాడు. అస్నాల శ్రీనివాస్

2007లో తనదైన మేధో శ్రమతో, తన తాత్విక పోరాటాల కార్యాచరణను అర్థం చేసుకున్న సహచర ఉద్యోగులతో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘంను శ్రీనివాస్ గౌడ్ స్థాపించారు. 2009 లో ఫ్రీజోన్ పై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా తన ఉద్యమాన్ని ప్రారంభించారు. సోదర టీఎన్జీవో సంఘం తో కలిసి సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహణలో క్రియాశీలంగా పాల్గొని గెజిటెడ్ ఉద్యోగులను వేలాదిగా తరలించాడు. పెన్ డౌన్, సకల జనుల సమ్మె, మానవహారం ఇలా అనేక మిలిటెంట్ పోరాటాలకు నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేవరకు నిర్విరామ కృషిని శ్రీనివాస్ గౌడ్ గారు చేశారు.

పెన్ డౌన్, సకల జనుల సమ్మె, మానవహారం ఇలా అనేక మిలిటెంట్ పోరాటాలకు నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేవరకు నిర్విరామ కృషిని శ్రీనివాస్ గౌడ్ గారు చేశారు. అస్నాల శ్రీనివాస్

★ ఓరుగల్లు టిజిఓ యూనిట్ ప్రస్థానం

తెలంగాణలో లో పోరాటాల సాహిత్య సాంస్కృతిక భూకంప కేంద్రంగా ప్రసిద్ధి చెందినది ఓరుగల్లు జిల్లా శ్రీనివాస్ గౌడ్ జ్ఞాన శ్రమ విస్పోటనంతో వెలిగించిన టి.జి.ఓ కాగడాను తొలిసారిగా అందుకొని జ్వలింప చేసిన తొలి జిల్లా వరంగల్. అణచివేతను అలవోకగా భరించే స్వభావం, తిరిగి రెట్టింపు శక్తితో ప్రతిఘటించి సమస్యల్ని పరిష్కరించుకునే సహజాత గుణాలు వరంగల్ ఉద్యోగ వర్గాలకు ఉంది.

టిజిఓ వరంగల్ శాఖ తొలి అధ్యక్షుడిగా పుల్లూరు సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా నాగయ్య, ఉపాధ్యక్షులుగా పోట్లపల్లి శ్రీనివాసరావు మురళీధర్ రెడ్డి, మహిళా నేతలుగా ఆదిలక్ష్మీ, భారతిలతో తన కార్యక్రమాలను ఆరంభించింది. అస్నాల శ్రీనివాస్

టిజిఓ వరంగల్ శాఖ తొలి అధ్యక్షుడిగా పుల్లూరు సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా నాగయ్య, ఉపాధ్యక్షులుగా పోట్లపల్లి శ్రీనివాసరావు మురళీధర్ రెడ్డి, మహిళా నేతలుగా ఆదిలక్ష్మీ, భారతిలతో తన కార్యక్రమాలను ఆరంభించింది. వృత్తి రీత్యా సహకార శాఖ ఉద్యోగిగా ప్రవృత్తి రీత్యా గతి తార్కిక తాత్వికత వెలుగులో సామాజిక శాస్త్రవేత్తగా ఉన్న పుల్లూరు సుధాకర్ నాయకత్వంలో 2009 నుండి 2011 వరకు రాష్ట్ర సాకారం కోసం గెజిటెడ్ ఉద్యోగులను చైతన్యం పరిచే సదస్సుల నిర్వహణ సభ్యత్వ నమోదు నిర్విరామంగా జరిగింది. తన మేధో సంపన్న ప్రసంగాలతో ఉద్యోగులను చైతన్యపరుస్తూ తెలంగాణ జాక్ ఇచ్చే ప్రతి పోరాట పిలుపును విజయవంతం చేశారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న పొట్లపల్లి శ్రీనివాసరావు గారు సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలలో అగ్రగామిగా నిలుస్తూ తన కవిత్వంతో తాను రచించిన పాటలతో ఆల్బమ్ లు రూపొందించి ప్రజలను, ఉద్యోగులను ఉత్తేజపరిచారు. ఈ కమిటీ లో ఉపాధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రావు జనవరి – 05 – 2010 లో శ్రీనివాస్ గౌడ్ గారితో డిల్లీకి వెళ్లారు. చిదంబరం చేసిన తెలంగాణ వ్యతిరేక ప్రకటనకు నిరసనగా జరిగిన ఉద్యమం లో పాల్గొని అరెస్ట్ అయ్యారు.

జులై 2011 నుండి పరిటాల సుబ్బారావు అధ్యక్షుడిగా, అన్నమనేని జగన్మోహన్ రావు ప్రధానకార్యదర్శిగా టిజిఓ వరంగల్ ద్విగుణీకృత ఉత్సహంతో తెలంగాణ ఉద్యమ ప్రవాహాన్ని ఉరకలెత్తించింది. సబ్బండ వర్ణాలతో మమేకమై ఉద్యమమే శ్వాసగా కొనసాగి యావత్ తెలంగాణ ఉద్యోగ సంఘాలకు ఒక నమూనాగా మార్గదర్శిగా వరంగల్ టిజిఓ పనిచేసింది.

జులై 2011 నుండి పరిటాల సుబ్బారావు అధ్యక్షుడిగా, అన్నమనేని జగన్మోహన్ రావు ప్రధానకార్యదర్శిగా టిజిఓ వరంగల్ ద్విగుణీకృత ఉత్సహంతో తెలంగాణ ఉద్యమ ప్రవాహాన్ని ఉరకలెత్తించింది. అస్నాల శ్రీనివాస్

గెజిటెడ్ ఉద్యోగులను ఉద్యమంలో భాగస్వామి చేస్తూ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వారి సీనియారిటీ సమస్యలను పరిష్కరించి పదోన్నతులను సాధించడంలో సుబ్బన్న, జగనన్న ద్వయం అగ్రగామిగా పని చేసింది.
ఉద్యమ కాలంలో పోలీసు శాఖ మినహా అటవీ శాఖ, ఎక్సైజ్ శాఖ మొదలగు యూనిఫార్మ్ ఉద్యోగులతో మహా కవాతును నిర్వహించింది. కలెక్టర్ మినహా అన్ని జిల్లా స్థాయి అధికారులను ఉద్యమాలలో భాగస్వామిని చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కలెక్టర్ ప్రాంగణంలో గల ప్రగతి భవన్ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. ఉద్యమ వ్యూహాలను, సహకారానికి పలు రాజకీయ నేతలు, మంత్రులు, మేధావులు టిజిఓ కార్యాలయానికి వచ్చి సమాలోచన చేసేవారు.

ఉద్యమ క్రమంలో బరిగీసి సాయుధ పోరాటాలకు ఊపిరి ఉదిన వరంగల్ వీర భూమిలో ఆత్మహత్య ఒక పోరాట రూపంగా రావడం పట్ల తీవ్రంగా చలింపచేసి హృదయ వేదనను, రోధనలను కల్గించింది.

సమాజానికి తిరిగి చెల్లించు వెలుగులో పలు కార్యక్రమాలను టిజిఓ వరంగల్ నిర్వహించింది. ఉద్యమాలలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను ఉద్యోగ సంఘాల జాక్ తో కలిసి ఆర్ధిక చేయూతను ఇచ్చింది. వంద అమరవీరుల కుటుంబ వారసులకు ఉద్యోగాలు వచ్చేవరకు అన్ని రకాల సహాయాన్ని అందించింది.అస్నాల శ్రీనివాస్

సమాజానికి తిరిగి చెల్లించు వెలుగులో పలు కార్యక్రమాలను టిజిఓ వరంగల్ నిర్వహించింది. ఉద్యమాలలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను ఉద్యోగ సంఘాల జాక్ తో కలిసి ఆర్ధిక చేయూతను ఇచ్చింది. వంద అమరవీరుల కుటుంబ వారసులకు ఉద్యోగాలు వచ్చేవరకు అన్ని రకాల సహాయాన్ని అందించింది.

తెలంగాణ ప్రజా పోరాటాల చరిత్రను ఈనాటి విద్యార్థి యువతరానికి తెలియచేయడానికి వరంగల్ కేంద్రంగా పని చేస్తున్న దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ పొలిటికల్ జాక్ కు పలు కార్యక్రమాలను సూచించింది. తెలంగాణ విప్లవ వేగుచుక్క దొడ్డి కొమురయ్య అమరత్వం పొందిన జూలై 4న తెలంగాణ అమరుల దినంగా పాటించాలని అలాగే ముల్కీ అమరవీరుల సంస్మరణ సభ జరపాలని కోరింది.
కొందండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీనివాస్ గౌడ్, దేవిప్రసాద్ లతో ఉన్న జాక్ పై సభలను జరపాలని పిలుపు నిచ్చింది.

★ టిజిఓ వరంగల్, దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ :

వరంగల్ లో రాజకీయ సాహిత్య కార్యశాలగా, ఉద్యమ ఉద్యమకారులకు శిక్షణ ఇచ్చే పాఠశాలగా అస్నాల శ్రీనివాస్ స్థాపించిన దొడ్డి కొమురయ్య పౌండేషన్ పని చేసింది. ప్రజల కోసం పని చేసి అమరులైన వారిని సమాజం పట్టించుకోవాలి అనే విలువలను కలిగి ఉన్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సహకారంతో దొడ్డి కొమురయ్య పౌండేషన్ 50కి పైగా సెమినార్లను నిర్వహించింది. అల్లం నారాయణ రాసిన ప్రాణహిత వంటి పలు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలు జరిపింది. ఈ సెమినార్లలో తెలంగాణ రాష్ట్ర అగ్రశ్రేణి రాజకీయ నేతలు, మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు కవులు కళాకారులు పాల్గొన్నారు.

వరంగల్ లో రాజకీయ సాహిత్య కార్యశాలగా, ఉద్యమ ఉద్యమకారులకు శిక్షణ ఇచ్చే పాఠశాలగా అస్నాల శ్రీనివాస్ స్థాపించిన దొడ్డి కొమురయ్య పౌండేషన్ పని చేసింది. అస్నాల శ్రీనివాస్

ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా పరిటాల సుబ్బన్న తెలంగాణ ఉద్యమం సాకారం అయ్యేవరకు ఉద్యమం సజీవంగా ఉండటం కోసం తెలంగాణ వచ్చాక ఎట్లా ఉండాలి అనే కోణంలో తన ప్రసంగాలను చేసేవారు. అంతేకాకుండా ఉద్యమకాలంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉద్యమాల్లో పాల్గొంటున్న విద్యార్థులకు ఉన్నత విద్య ఉపాధి అవకాశాలను పొందటానికి నిర్వహించే శిక్షణ కార్యక్రమాలను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ముఖ్యమైన చేయూతను అందించింది. టీచర్ ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ లెక్చరర్ ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణా శిబిరాలలో విద్యార్థులకు పలు సౌకర్యాలు కల్పించారు. పుస్తకాలను పంపిణీ చేసింది. సాంస్కృతిక ఉద్యమ సారథులు కవులను, కళాకారుల, చిత్రకారులను ప్రోత్సాహమిస్తూ కాపాడుకుంది. తెలంగాణ సాకారం అయ్యేవరకు జరిగిన సకల జనుల సమ్మె, మానుకోట స్పూర్తి యాత్ర, సాగర హారం, మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించింది.

★ ఓరుగల్లు కీర్తి స్థూపం :

తెలంగాణ బిల్లును 18 ఫిబ్రవరి 2014లో లోకసభ, 20 ఫిబ్రవరి 2014లో రాజ్యసభ, 28 ఫిబ్రవరిలో రాష్ట్రపతి ఆమోదముద్రలతో అంతిమ విజయం సాకారం అయిన నేపథ్యంలో జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావాన్ని ఘనంగా జరుపు కోవడం కోసం చరిత్రలో భవిష్యత్ తరాలకు వరంగల్ నిర్వహించిన పాత్రను చిరస్మరణీయంగా ఉండడం కోసం కలెక్టర్ నివాసం ఎదురుగా 30 లక్షల రూపాయలతో ఓరుగల్లు కీర్తి స్థూపాన్ని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వరంగల్ శాఖ నేతృత్వంలో టీఎన్జీవో ఇతర సోదర సంఘాల భాగస్వామ్యంతో నిర్మించింది.

కలెక్టర్ నివాసం ఎదురుగా 30 లక్షల రూపాయలతో ఓరుగల్లు కీర్తి స్థూపాన్ని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వరంగల్ శాఖ నేతృత్వంలో టీఎన్జీవో ఇతర సోదర సంఘాల భాగస్వామ్యంతో నిర్మించింది.అస్నాల శ్రీనివాస్

2017 నుండి అన్నమనేని జగన్మోహన్ రావు, రత్న వీరాచారి లు అధ్యక్ష, కార్యదర్శులుగా పుల్లూరి సుధాకర్, పరిటాల సుబ్బారావు వారసత్వాన్ని సమున్నతంగా నిలబెడుతూ టీజీవో వ్యవస్థాపకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి మన్నన పొందుతూ మమత గారి పర్యవేక్షణలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నిర్మాణపరంగా, సేవల పరంగా బలోపేతం చేశారు. ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వివిధ కేడర్ల అపరిష్కృత సమస్యలను తీరుస్తూ పదోన్నతుల వేగాన్ని పెంపొందించడంలో అగ్రగామిగా కదులుతున్నారు. సామాజిక బాధ్యతతో కరోనా మహమ్మారి కాలంలో పేద ప్రజలకు, జర్నలిస్టులకు పలు సేవా కార్యక్రమాలను అందించింది. పాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు ఏర్పాటు తర్వాత జగన్ మోహన్ రావు గారు ఉమ్మడి జిల్లా టి జి వో సమన్వయకర్తగా నూతన జిల్లాల కార్యవర్గాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో టి జి ఓ ఇంటర్ విద్య విభాగం ఏర్పాటుకు నాంది పలికారు.

2017 నుండి అన్నమనేని జగన్మోహన్ రావు, రత్న వీరాచారి లు అధ్యక్ష, కార్యదర్శులుగా టీజీవో వ్యవస్థాపకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి మన్నన పొందుతూ మమత గారి పర్యవేక్షణలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నిర్మాణపరంగా, సేవల పరంగా బలోపేతం చేశారు. – అస్నాల శ్రీనివాస్

టి జి ఓ కేంద్ర సంఘంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కిరణ్ గారు కార్యదర్శిగా నియమితులై టి జి ఓ కేంద్ర సంఘానికి ఉమ్మడి వరంగల్ జిల్లా టి జి ఓ విభాగాలకు వారధిగా నిలుస్తూ అన్ని శాఖల చెందిన కేడర్ సమస్యలను పరిష్కరిస్తూ తమ సేవలను అందిస్తున్నారు.
అస్నాల శ్రీనివాస్ టిజిఓ న్యూస్ అసోసియేట్ ఎడిటర్ గా, రచయితగా ప్రభుత్వ పాలన ఫలితాలు, చరిత్ర, సాహిత్యం, వైజ్ఞానిక అంశాలపై వందలాది వ్యాసాలను రాస్తున్నారు.



గత 12 సంవత్సరాల తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వరంగల్ శాఖ వికాసంలో ఎందరెందరో తన శక్తి మేరకు సేవలు అందించారు. అందిస్తూనే ఉన్నారు. మురళీధర్ రెడ్డి, ఫణికుమార్, ఈగ వెంకట్, హసన్, అంజాద్ అలీ అజార్, వెంకటేశ్వరరావు, కర్నొలియస్, డాక్టర్ ప్రవీణ్, అస్నాల శ్రీనివాస్, రవి, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, కిరణ్మయి, సుమలత, మాధవి వంటి, రాజేష్ పూర్తిస్థాయి టిజిఓ కార్యకర్తలుగా పని చేస్తున్నారు.


గౌరవ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు హనుమకొండ శాసనసభ్యులు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సహకారంతో సకల హంగులతో హన్మకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో భవన ప్రారంభం రేపు 30/01/2022 న జరుగుతున్నది.అస్నాల శ్రీనివాస్


★ టిజిఓ హనుమకొండ కార్యాలయం :

 తెలంగాణ ఉద్యమంలో తన వంతు చారిత్రక కర్తవ్యాన్ని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నిర్వహించింది. అదే స్ఫూర్తిని స్వరాష్ట్ర నవ నిర్మాణం లో శ్రమిస్తున్నది. తెలంగాణ ఉద్యమం అందించిన చారిత్రక వ్యక్తి శక్తి గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి దార్శనికత లో భాగంగా ప్రతి జిల్లాలో కలెక్టరేట్ ప్రాంగణంలో టీజీవో కార్యాలయాల ఏర్పాటుకు పూనుకున్నారు. గౌరవ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హనుమకొండ శాసనసభ్యులు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, హన్మకొండ కలెక్టర్ రాజీవ్ హన్మంత్ ల సహకారంతో సకల హంగులతో హన్మకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో భవన ప్రారంభం రేపు 30/01/2022 న జరుగుతున్నది. జగన్ మోహన్ రావు, టిజిఓ కేంద్ర సంఘ కార్యదర్శి కిరణ్ గార్ల నేతృత్వంలో టీజీవో హనుమకొండ భవనం రూపుదిద్దుకున్నది. తెలంగాణ ప్రగతి రథ చక్రాలకు ఇరుసుగా దోహదం చేసే మేధో మధనాలకు, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేసే ఉద్యోగుల వికాస కేంద్రంగా సేవలను నిర్విరామంగా అందించబోతున్నది.