APPSC : గ్రూప్ – 2 నూతన సిలబస్ విడుదల

విజయవాడ (ఎప్రిల్‌ – 28) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC ) గ్రూప్ – 2 పరీక్షలకు సంబంధించి తాజాగా కొత్త సిలబస్ (appsc Group 2 new syllabus) ను విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు ప్రధాన పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు.

150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

మెయిన్స్ లో రెండు పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కులకు (మొత్తం 300) ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం..

పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల మంచి ప్రశ్నలు అడుగుతారు.

APPSC GROUP 2 NEW SYLLABUS