AP INTER : అకాడమిక్ కేలండర్ విడుదల

విజయవాడ (ఎప్రిల్‌ – 28) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ విద్యా మండలి 2023 – 24 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ (ap intermediate academic calendar) విడుదల చేసింది.

జూన్ 1 – 2023 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి, మొత్తం 227 పనిదినాలు, 75 రోజులు సెలవు దినాలుగా పేర్కొన్నారు.

అక్టోబర్ 19-25 దసరా సెలవులు, జనవరి 11-17 సంక్రాంతి సెలవులను ప్రకటించారు.

డిసెంబర్ 18-23 హాఫ్ ఇయర్లీ పరీక్షలు, జనవరి 19-25 ప్రీ ఫైనల్ పరీక్షలు,

ఫిబ్రవరిలో రెండో వారంలో ప్రాక్టికల్స్, మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు, మార్చి 28, 2024 చివరి వర్కింగ్ డేగా పేర్కొన్నారు.