AP GENCO JOBS : కాంట్రాక్టు ఉద్యోగాలు

విజయవాడ (సెప్టెంబర్ – 20) : విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (AP GENCO contract JOBS) పరిధిలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో కాంట్రాక్టు ప్రాతిపదికన 26 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.

అర్హతలు : ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ) మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 31.08.2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

వేతనం : నెలకు రూ.25,000/- చెల్లిస్తారు.

ఎంపిక విధానం : ఎమ్మెస్సీలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పని ప్రదేశాలు: ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా /వీవీ రెడ్డి నగర్, వైఎస్సార్ కడప జిల్లా / నెలటూర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎంసీఎల్ కోల్ మైన్స్, తాల్చేర్, ఒడిశా/ఎస్సీసీఎల్ కోల్ మైన్స్, ఇల్లందు, మణుగూరు, తెలంగాణ.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు హార్డ్ కాపీని చీఫ్ జనరల్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) , మూడో అంతస్తు, ఏపీజెన్ కో చిరునామకు పంపించాలి.

దరఖాస్తు గడువు : 21.09.2023

దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరితేది : 30 – 09 – 2023

వెబ్సైట్ : https://apgenco.gov.in