DAILY CURRENT AFFAIRS IN TELUGU 19th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 19th SEPTEMBER 2023

1) 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.?
జ : ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)

2) “ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజన” పథకాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేయనున్నారు.?
జ : ఒడిశా

3) నాటో కూటమి ఏ పేరుతో అతిపెద్ద సైనిక విన్యాసాలు చేపట్టడానికి సిద్ధమైంది.?
జ : Steadfast Defender

4) బంగ్లాదేశ్ కు అతిపెద్ద ఎగుమతిదారుగా ఏ దేశం ఇటీవల నిలిచింది.?
జ : భారతదేశం

5) భారతదేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలో ఎన్ని ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.?
జ : 150

6) నాబార్డ్ సంస్థ అంతర్జాతీయ సంస్థ తో అగ్రికల్చర్ ఇన్నోవేషన్ డేటా కొరకు ఒప్పందం చేసుకుంది.?
జ : UNDP

7) UNESCO చేత భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందిన 41వ‌.42వ ప్రదేశాలు ఏవి మ.?
జ : శాంతి నికేతన్ & హోయసల ఆలయాలు

8) కేంద్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక ప్రకారం 2022లో అత్యధిక అవినీతి ఆరోపణలు ఏ శాఖ పై వచ్చాయి ?
జ : కేంద్ర హోమ్ శాఖ

9) ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023లో మహిళల 50 మీటర్ల రైసిల్ 3 పొజిషన్ లో రజతం నెగ్గిన భారత షూటర్ ఎవరు.?
జ : నిశ్చల్

10) హై జంప్ విభాగంలో ప్రపంచ రికార్డు (6.23 మీటర్లు) ఎత్తుదూకి రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు.?
జ : ఆర్మాండ్ డుప్లాంటీస్ (స్వీడన్)

11) 5,000 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డ్ (14:00:21 సెకండ్ లలో) సృష్టించిన అథ్లెట్ ఎవరు.?
జ : గడాఫ్ సెగీ (ఇథియోపియా)

12) మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 కు కేంద్రం ఏమని పేరు పెట్టింది.?
జ : నారీశక్తి వందన్ అధినియం

13) ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు .?
జ : రాజ్యాంగ (128వ సవరణ) బిల్లు 2023

14) రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండలిలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కానుందా.?
జ: లేదు

15) భారత దౌత్య వేత్తను ఏ దేశం వెనక్కి పంపింది.?
జ : కెనడా

16) ఇటీవల బ్రిటన్ లో హత్యకు గురైన హరిదీప్ సింగ్ నిజ్జర్ ఏ సంస్థకు చీప్ గా వ్యవహరించేవాడు.?
జ : ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (KTF)

17) ఆసియన్ క్రీడలు 2022 (2023) ఏ నగరంలో జరుగుతున్నాయి.?
జ : హంగ్జౌ (చైనా)

18) ఆసియన్ క్రీడలు 2022 (2023) మస్కట్ లు ఏమిటి.?
జ : చెన్‌చెన్ – కాంగ్‌కాంగ్ – లిన్‌లిన్

19) చైనాలోని హంగ్జౌ నగరం లో జరుగుతున్న ఆసియన్ గేమ్స్ – 2022 ఎన్నవవి.?
జ : 19వ

20) గణేశుని బోమ్మ ఏ దేశపు కరెన్సీ పై ఉంటుంది.?
జ : ఇండోనేషియా