ANGANWADI JOBS : పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ జాబ్స్

శ్రీ సత్యసాయి జిల్లా (సెప్టెంబర్ – 24) : పుట్టపర్తి శ్రీసత్యసాయి జిల్లా మహిళ, శిశు సంక్షేమ సాధికారిత అధికారి జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న 65 అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ మినీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టుల (anganwadi jobs in satyasai district andhra pradesh) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పదవ తరగతి అర్హత కలిగి ఉండి జిల్లా వాసులైన మహిళ అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు ప్రత్యక్షంగా సంబంధిత కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ పోస్టుల వివరాలు :

అంగన్వాడీ వర్కర్
అంగన్వాడీ హెల్పర్
మినీ అంగన్వాడీ వర్కర్

అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 21 నుంచి 35 సంవత్సరాలు మధ్య ఉండాలి. (SC, ST అభ్యర్థులకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.)

వేతనం : నెలకు అంగన్వాడీ వర్కర్ కు రూ.11,500/-, అంగన్వాడీ హెల్పర్/ మినీ అంగన్వాడీ వర్కర్ కు రూ.7,000/-

ఎంపిక విధానం : పదోతరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ (ప్రత్యక్ష) పద్దతిలో దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి

ప్రాజెక్టు పేరు : హిందూపురం, ధర్మవరం, సికె పల్లి, మడకశిర, పెనుకొండ, కదిరి, నల్లచెరువు, గుడిబండ, సోమందేవంపల్లి, పుట్టపర్తి, ఓబులదేవరచెరువు.

చివరి తేదీ: సెప్టెంబర్ – 29- 2023 సాయంత్రం 5.00 గంటలలోపు

◆ వెబ్సైట్ : https://srisathyasai.ap.gov.in/