- మంత్రి కేటీఆర్ సూచన మేరకు అందుబాటులోకి
- ఆఫ్ లైన్ లో 1,100 కే నాలుగు విలువైన పుస్తకాలు
హైదరాబాద్ (డిసెంబర్ – 16) : ప్రస్తుతం ముద్రణ రూపంలోనే అందుబాటులో ఉన్న డా.బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ (ambedkar-open-university-books-for-competitive-exams) రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచనల మేరకు త్వరలో పీడీఎప్ రూపంలో డిజిటల్ గా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడానికి వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు నెలల్లో పీడీఎఫ్ రూపంలో అందుబాటులో రానుంది.
తెలంగాణలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ లు వస్తున్న సందర్భంగా పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు మరింత మేలు చేకూర్చేందుకు వీలుగా ఆన్లైన్ లో పీడీఎప్ రూపంలో తీసుకురానుంది.
విశ్వవిద్యాలయం గత నెలలో ఈ స్టడీ స్టడీ మెటీరియల్ ను విడుదల చేయగా.. ఇప్పటివరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో కలిపి 7,500 మంది కొనుగోలు చేశారని… భారత చరిత్ర- సంస్కృతి, భారత సమాజం రాజ్యాంగం – పరిపాలన, ఆర్థిక వ్యవస్థ – అభివృద్ధి, తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావంపై వర్సిటీ పుస్తకాలను ముద్రించింది.
కేవలం గ్రూప్స్ వంటి పరీక్షలకే కాకుండా అన్ని రకాల పరీక్షలకు ఉపయోగకరమైన రీతిలో రూపొందించినట్లు తెలిపారు. నాలుగు పుస్తకాల ఈ సెట్ ను యూనివర్సిటీ కేవలం 1,100 రూపాయలకు విక్రయిస్తోంది.