AP JOBS : కోనసీమ జిల్లాలో పరీక్ష లేకుండా 993 పోస్టులు

ముమ్మిడివరం (సెప్టెంబర్ – 08) : కోనసీమలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం.. డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన 993 పోస్టుల భర్తీకి దరఖాస్తులు;కోరుతోంది.

పోస్టుల వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్-331,
డేటాఎంట్రీ ఆపరేటర్-331,
హెల్పర్-331.

అర్హతలు :

టెక్నికల్ అసిస్టెంట్: బీఎస్సీ(అగ్రికల్చర్ /మైక్రో బయాలజీ /బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ) బీఎస్సీ (బీజెడీసీ) /బీఎస్సీ(లైఫ్ సైన్సెస)/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.

డేటాఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

హెల్పర్: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: టీఏ/డీఈవో పోస్టులకు 21 నుంచి 40;ఏళ్లు, హెల్పరు 18నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ / డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా అందజేయాలి.

చిరునామా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, ఎయిమ్స్ కాలేజ్, మొదటి అంతస్తు, ముమ్మిడివరం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 08.09.2023.

వెబ్సైట్: konaseema.ap.gov.in