DSC NOTIFICATION : 5,089 ఉద్యోగాలకై నోటిఫికేషన్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 08) : పాఠశాల విద్య శాఖ ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా ఎంపిక కమిటీ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలలలో స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వంటి 5,089 ఉద్యోగాల నియామకం కొరకు నోటిఫికేషన్ జారీ (telangana dsc notification 2023 released) చేసింది. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు.

నియామకం కొరకు జిల్లావారీగా ప్రకటిత ఉద్యోగ ఖాళీల వివరాలు కింద ఇవ్వబడినవి.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

గడువు : దరఖాస్తులకు సెప్టెంబర్ 20-2023 నుండి అక్టోబర్ 21-2023 వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు.

దరఖాస్తు ఫీజు : దరఖాస్తు ప్రాసెసింగ్ మరియు వ్రాతపరీక్ష కొరకు చెల్లించాల్సిన రుసుము ఒక్కో ఉద్యోగానికి రూ.1,000/-. వివిధ ఉద్యోగాలకు హాజరుకాగోరే అభ్యర్థులు ఒక్కో ఉద్యోగానికి విడిగా రూ.1,000/- రుసుము చెల్లించాలి మరియు దరఖాస్తు చేస్తున్న ఒక్కో ఉద్యోగానికి విడిగా దరఖాస్తులు దాఖలు చేయాలి.

వయోపరిమితి : అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు & గరిష్టంగా 44 సంవత్సరాలు కలిగి ఉండాలి. వయస్సు 01-07-2023 నాటికి లెక్కించబడుతుంది (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

అర్హతలు: పోస్టును అనుసరించి డిగ్రీ, ఇంటర్మీడియట్, డీఎడ్, బీఈడీ, టెట్, సీటెట్ కలిగి ఉండాలి.

వ్రాతపరీక్ష విధానం : ‘ఆన్లైన్’లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) పద్దతిలో జరుగుతుంది.

పరీక్ష కేంద్రాలు : 1) మహబూబ్ నగర్, 2) రంగారెడ్డి, 3) హైదరాబాద్, 4) మెదక్, 5) నిజామాబాద్, 6) ఆదిలాబాద్, 7) కరీంనగర్, 8) వరంగల్, 9) ఖమ్మం, 10) నల్లగొండ మరియు 11) సంగారెడ్డి.

పరీక్ష తేదీలు : నవంబర్ 20 – 2023 నుండి 30 – 2023 మధ్యకాలంలో నిర్వహించబడుతుంది.

వెబ్సైట్ : https://schooledu.telangana.gov.in