6 Guarentees Guidelines – విధివిధానాలు

హైదరాబాద్ (డిసెంబర్ – 25) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సంబంధించిన 5 గ్యారెంటీలకు అనగా చేయూత, రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు పథకాల అమలు కోసం (6 Guarantees Application Guidelines) దరఖాస్తులను డిసెంబర్ 28 నుంచి జన వరి 6వ తేదీ వరకు (డిసెంబర్ 31, జనవరి 1 సెలవు) స్వీకరించనున్నద

రాష్ట్రస్థాయిలో దరఖాస్తు ఫారం రూపొందించి జిల్లాలకు పంపించాలి.

దరఖాస్తులను 2 రోజుల ముందే గ్రామాల్లో పంపిణీ చేయాలి.

మహిళలకు ప్రత్యేక దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లు, క్యూలైన్లు పెట్టాలి.

దరఖాస్తుదారులు ఎక్కువగా ఉంటే టోకెన్ విధానాన్ని అనుసరించాలి.

దరఖాస్తుతోపాటు ఆధార్, తెల్లరేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలి.

దరఖాస్తుదారుకు రశీదు కచ్చితంగా ఇవ్వాలి.

రశీదు, దరఖాస్తును ఆన్లైన్ చేసి, దరఖాస్తులకు ప్రత్యేక సంఖ్య ఇవ్వాలి.

గ్రామాల్లో అయితే పంచాయతీలో గ్రామ సభలు నిర్వ హించాలి.

పట్టణాల్లో అయితే మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తులు స్వీకరించాలి.

ప్రతి బృందం వార్డుల్లో కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలి.

ప్రతి 100 కుటుంబాలకు కనీసం ఒక కౌంటరు ఉండాలి.

ప్రతిరోజు రాత్రి 8 గంటల వరకు డెయిలీ రిపోర్టు అందించాలి.

సోమవారం లోపు అధికారుల బృందాలను ఏర్పాటు చేసి, గ్రామాలను విజిట్ చేయాలి. 26 వరకు శిక్షణ పూర్తి చేయాలి.

నాలుగు నెలలకోసారి ప్రజాపాలన నిర్వహించాలి.