SSC JOBS : 5,369 ఉద్యోగాలకై నోటిఫికేషన్ విడుదల

న్యూడిల్లీ (మార్చి – 06) : భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్గ్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖలో చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 5,369 భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది.

◆ మొత్తం ఖాళీలు: 5,369

◆ పోస్టుల వివరాలు : ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్టేటర్, నావిగేషనల్ అసిస్టెంట్ తదితరాలు.

అర్హతలు : పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

వయోపరిమితి : 18-30 ఏళ్లు ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు)

◆ ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ డేటా ఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

◆ పరీక్ష విధానం: పరీక్షలో భాగంలో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : రూ.100.

◆ దరఖాస్తు గడువు : మార్చి – 06 – 2023 నుంచి మార్చి 27 – 2023 వరకు

◆ ఆన్లైన్ పేమెంట్ చివరి తేది: మార్చి – 28 – 2023.

పరీక్ష తేదీ : జూన్, జూలై – 2023

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://ssc.nic.in/