Jobs : అటవీ శాఖలో 1,500 ఉద్యోగాలు

అన్నమయ్య జిల్లా (జూన్ – 27) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖలో ఖాళీగా ఉన్న రేంజ్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్ల వంటే పోస్టుల భర్తీకి (jobs in forest department) ప్రభుత్వానికి ప్రతిపాదనలో పంపినట్లు సమాచారం.

అటవీశాఖలో 1,500 రేంజి, సెక్షన్, బీట్ అధికారులను నియమించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని, అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్ వై. మధుసూదన్ రెడ్డి తెలిపారు.