BSc Nursing : Army Nursing College అడ్మిషన్లు

హైదరాబాద్ (జూన్ – 28) : దేశవ్యాప్తంగా ఉన్న 5 కాలేజ్ ఆఫ్
నర్సింగ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS) లలో నాలుగేళ్ల BSc Nursing కోర్సుల్లో ప్రవేశానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ముంబై, బెంగళూరు, కలకత్తా, పూణె, లక్నో లలో ఈ నర్సింగ్ కళాశాలలు కలవు.

సీట్ల సంఖ్య : 220

అర్హతలు : అవివాహిత/ విడాకులు తీసుకున్న చట్టబద్ధంగా విడిపోయిన/ వితంతువులైన మహిళా అభ్యర్థులు అర్హులు. కనీసం 50% మార్కులు సీనియర్ సెకండరీ పరీక్ష 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్). నీట్ (యూజీ) 2023లో అర్హత, కనిష్ఠ ఎత్తు 152 సెం.మీ. ఉండాలి.

వయోపరిమితి : 01-10-1998- 30-09-2006 మధ్య జన్మించినవారై ఉండాలి.

◆ ఎంపిక విధానం : నీట్ 2023 స్కోరు, జనరల్ ఇంటెలిజెన్స్/ జనరల్ ఇంగ్లిష్ టెస్ట్, సైకలాజికల్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : జూలై 04 – 2023.

◆ వెబ్సైట్: https://joinindianarmy.nic.in/