- ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
జనగామ (జూన్ -27) : స్థానిక ధర్మకంచ, జనగాం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మంగళవారం విచ్చేసిన టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కళాశాలలోని అడ్మిషన్ల విధానము, విద్యార్థుల సంఖ్య, విద్యార్థులకు కళాశాలలో కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, అధ్యాపకుల వివరాలు (employees news) ఏ విధంగా ఉన్నాయో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్ ను అడిగి తెలుసుకొన్నారు.
ప్రభుత్వ కళాశాలను రక్షించుకోవలసిన బాధ్యత నేడు అధ్యాపకులపై ఉందని, విద్యార్థులకు మెరుగైన విద్యను, సౌకర్యాలను అందించాలని సూచించారు. ఇటీవలనే కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేసి రెగ్యులర్ అయిన అధ్యాపకులను అభినందించారు.
ఇంకా కొన్ని కారణాలతో రెగ్యులర్ గాని కాంట్రాక్టు లెక్చరర్స్ విజ్ఞప్తి మేరకు స్పందించిన ఎమ్మెల్సీ త్వరలోనే మిగిలిన వారిని రెగ్యులర్ చేసే విధంగా ముఖ్యమంత్రితో, విద్యాశాఖ మంత్రితో, ఇంటర్ అధికారులతో మాట్లాడి రెగ్యులర్ అయేవరకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ రావు మరియు కార్యదర్శి కనకయ్య, కళాశాల అధ్యాపకులు డాక్టర్ వరూధిని, శ్రీకాంత్ రెడ్డి, ఇశ్రాత్ భాను, షహనాజ్, ముక్తాదిర్, రవిప్రసాద్, ప్రియదర్శిని, రేఖ, ఇంతియాజ్ ఉన్నారు.