BIKKI NEWS (SEP. 16) : zero students schools 1864 in telangana. తెలంగాణ రాష్ట్రంలో 26,287 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఒక్క విద్యార్థి కూడా లేనివి 1,864 పాఠశాలలు, 100 మంది విద్యార్థులు దాటినవి కేవలం 5,367 (20.41%) మాత్రమే. ఉన్నట్లు విద్యాశాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
zero students schools 1864 in telangana.
పాఠశాలల్లో పారిశుద్ధ్య బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించిన విషయం తెలిసిందే. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు ఇస్తామని, నిధులను జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్టు(డీఎంఎఫ్‌టీ) పద్దు నుంచి విడుదల చేస్తామని సర్కారు ప్రకటించింది. ఈ క్రమంలో విద్యాశాఖ జిల్లాల వారీగా పాఠశాలలు, వాటిల్లో విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను అందజేసింది. ఆ ప్రకారం డీఎంఎఫ్‌టీ కింద మూడు నెలలకు అవసరమైన రూ.40.83 కోట్లు విడుదల చేయాలని గనుల శాఖ సంచాలకుడు బీఆర్‌వీ సుశీల్ కుమార్.. సింగరేణి సీఎండీకి లేఖ రాశారు.
మొత్తం పాఠశాలలు : 26,287
సున్నా విద్యార్థులు – 1,864
1-30 విద్యార్థులు – 9,447
31 – 100 విద్యార్థులు – 9,609
101- 250 విద్యార్థులు – 3,947
251 – 500 విద్యార్థులు – 1,063
501 – 750 విద్యార్థులు – 272
750 పైగా విద్యార్థులు – 85