Home > LATEST NEWS > తెలుగు మరియు హిందీ భాషలను కాపాడాలి – సయ్యద్ జబీ

తెలుగు మరియు హిందీ భాషలను కాపాడాలి – సయ్యద్ జబీ

BIKKI NEWS (APR. 09) : Zabee requesting about Sanskrit as a second language issue. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ద్వితీయభాష సంస్కృతం ప్రవేశ పెట్టే విషయంలో పునరాలోచించాలని మైనారిటీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ జబీ విజ్ఞప్తి చేశారు.

Zabee requesting about Sanskrit as a second language issue

ప్రభుత్వ పాఠశాలలలో మరియు ప్రభుత్వ కళాశాలలలో త్రిభాష సూత్రం ప్రకారంగా ఇంగ్లీషుతో పాటు మరొక రాష్ట్ర భాష తెలుగు లేదా జాతీయ భాష హిందీ తీసుకుంటున్నారు, ఈ మూడు భాషలు చదవడానికి, రాయడానికి, మరియు మాట్లాడడానికీ వీలున్న భాషలు, పోటీ పరీక్షల్లో మరియు ఉన్నత చదువులకు ఉపయోగపడే భాషలు కావున విద్యార్థులు వీటిని ఎన్నుకుంటారు.

సంస్కృతం, అరబిక్, మరియు ఫ్రెంచ్ తదితర భాషలకు సమాన విలువలు ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వ కళాశాలలలో ప్రవేశ పెట్టినట్లైతే రాను రాను విద్యార్థులు మాతృ భాష తెలుగును మర్చిపోయే ప్రమాదం ఉంది.

మోడల్ స్కూల్స్, గురుకులాలు, కె.జి.బి.వి, రెసిడెన్షియల్ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు విచ్చలవిడిగా పెరిగిపోతున్న క్రమంలో ప్రభుత్వ కళాశాలలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఉన్న కొద్దిమంది విద్యార్థుల్లో మరొక భాష ప్రవేశ పెట్టినట్లైతే ఏ ద్వితీయ భాషకు కూడా సరిపడ సంఖ్య లేకుండా పోతుందని తెలుపుతూ… దయచేసి సంస్కృత భాష విషయంలో తొందరపడకుండా, ముఖ్య సమస్య అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలను కాపాడడానికి చర్యలు చేపట్టె విధంగా ప్రణాళికలు రూపొందించాలని కోరుతూ, తెలుగు, హిందీ భాష అధ్యాపక సంఘాల తరపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు