Home > EDUCATION > UNIVERSITIES NEWS > Sports University – తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు

Sports University – తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు

  • ఒలింపిక్స్ స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్స్ అకాడమీ లు
  • అథ్లెట్లకు శిక్షణలో కొరియన్ స్పోర్ట్స్ యూనివర్శిటీ సహకారం
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు

BIKKI NEWS (AUG. 18) : YOUNG INDIA SPORTS UNIVERSITY IN TELANGANA. హైదరాబాద్ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ(ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్ హబ్ లో దీన్ని ఏర్పాటు చేస్తారు.

YOUNG INDIA SPORTS UNIVERSITY IN TELANGANA

దాదాపు 12 వివిధ క్రీడల అకాడమీలను ఇందులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ స్పోర్ట్స్ హబ్ లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తారు.

కొత్త గా స్థాపించిన స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీకి “యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ” అనే పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనువైన స్థలంగా ప్రస్తుతం హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను పరిశీలిస్తున్నారు. సదరు క్యాంపస్ ను ఒలింపిక్స్ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలుండేలా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని (Korea National Sport University – KNSU)ని సందర్శించారు. ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్స్ యూనివర్సిటీ గా ప్రత్యేకత చాటుకుంది.

ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా మొత్తం 32 పతకాలు గెలుచుకోగా, అందులో 16 పతకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే కావడం గమనార్హం. ఈ యూనివర్సిటీలో శిక్షణ పొంది, పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో మూడు బంగారు పతకాలు సాధించిన అథ్లెట్ లిమ్ సి-హైయోన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పర్యటన లో కలిసి అభినందించారు.

భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లకు శిక్షణ ఇచ్చేలా తెలంగాణ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీకి సాంకేతిక భాగస్వాములుగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సేవలు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు