ప్రపంచంలోని ప్రధాన రవాణా కాలువలు

BIKKI NEWS : ప్రపంచంలోని ప్రధాన రవాణా కాలువలు వాటి ప్రత్యేకతలను (List of worlds-main-canals-for-transport) పోటీ పరీక్షల నేపథ్యంలో నేర్చుకుందాం..

★ వైట్ సీ – బాల్టిక్ సీ కెనాల్ :- రష్యాలో ఉంది. వైట్, బాల్టిక్ సముద్రాల మధ్య రవాణాకు ఉపయోగపడుతోంది. ఈ కాలువను 1933లో నిర్మించారు. దీని పొడవు 227 కిలోమీటర్లు.

★ రైన్-మెయిన్- డాన్యూబ్ కెనాల్ :- పశ్చిమ ఐరోపాలో మూడు ప్రధాన నదులను కలుపుతుంది. 1938కి ముందు ఈ కెనాల్ ను నిర్మించారు. అట్లాంటిక్ సముద్రం మీదుగా ఉత్తర, నల్ల సముద్రాల మధ్య రవాణాకు ఇది తోడ్పడుతోంది. దీని పొడవు 171 కిలోమీటర్లు.

★ సూయజ్ కాలువ :- మధ్యదరా, ఎర్రసముద్రాలను కలుపుతూ రవాణాలో కీలకంగా ఉంది. 19వ శతాబ్దం లో ఈ కెనాల్ ను ఈజిప్టులో నిర్మించారు. దీని పొడవు 163 కిలోమీటర్లు.

★ కీల్ కాలువ :- బాల్టిక్, ఉత్తర సముద్రాలను కలుపుతూ జర్మనీ మీదుగా రవాణాకు ఉపయోగపడుతోంది. 18వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. దీని పొడవు 98 కిలోమీటర్లు.

★ పనామా కాలువ :- పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాలను కలుపుతుంది. 1914లో ఈ కెనాల్ ను నిర్మించారు. పొడవు 77 కిలోమీటర్లు.

★ ఓల్గా- డాన్ కెనాల్ :- కాస్పియన్, నల్ల సముద్రాలను కలుపుతూ రష్యాలోని వోల్గా, డాన్ నదుల మీదుగా రవాణాకు ఉపయోగపడుతోంది. ఈ కెనాల్ ను 16వ శతాబ్దంలో నిర్మించారు. పొడవు 101 కిలోమీటర్లు.