BIKKI NEWS (MARCH 21) : World’s Happiest Countries index 2025 నివేదిక లో 143 దేశాలతో కూడిన జాబితాలో భారత్ 118వ స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా యూఎన్ ఆధారిత సంస్థ ర్యాంకులను విడుదల చేసింది.
World’s Happiest Countries index 2025
2024 లో భారత్ 126వ స్థానంలో నిలవడం India rank in world happiest countries list 2025. విశేషం. ఈ ఏడాది ర్యాంక్ మెరుగుపడి 118 కి చేరింది.
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ మరోసారి అగ్ర స్థానంలో నిలిచింది. వరుసగా ఎనిమిదో సారి ఆ దేశం మొదటి స్థానంలో నిలిచింది.
జీవితంపట్ల సంతృప్తి, దేశ తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం వంటి అంశాల ఆధారంగా ప్రపంచంలోనే 147 దేశాలకు ర్యాంకింగ్‌లను నిర్ణయించినట్టు సంస్థ వెల్లడించింది.
ఈ రిపోర్ట్‌లో ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్‌లాండ్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఈ జాబితాలో భారత సరిహద్దు దేశాలు చైనా (68), నేపాల్ (92), పాకిస్థాన్ (109), శ్రీలంక (133), బంగ్లాదేశ్ (134) దేశాలు స్థానాలో నిలిచాయి.
2020లో తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్థాన్ ఈ జాబితాలో చిట్టచివరి స్థానం (147)లో నిలిచింది. ఇక అగ్రరాజ్యం అమెరికా 24వ స్థానంలో నిలిచాయి.
నిరంతరం యుద్దాలతో సతమతమవుతున్న పాలస్తీనా 108, ఉక్రెయిన్ – 111వ స్థానంలో నిలవడం విశేషం.
TOP 10 HAPPIEST COUNTRIES 2025
1) ఫిన్లాండ్
2) డెన్మార్క్
3) ఐస్‌లాండ్
4) స్వీడన్
5) నెదర్లాండ్స్
6) కోస్టారికా
7) నార్వే
8) ఇజ్రాయెల్
9) లక్సెంబర్గ్
10) మెక్సికో
LASR 5 HAPPIEST COUNTRIES 2025
147) అఫ్ఘనిస్తాన్
146) సిర్రా లియోన్
145) లెబనాన్
144) మాలవి
143) జింబాబ్వే
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్