Home > CURRENT AFFAIRS > REPORTS > Worlds Happiest Counties 2024 – ప్రపంచ సంతోషకర దేశాల సూచీ

Worlds Happiest Counties 2024 – ప్రపంచ సంతోషకర దేశాల సూచీ

BIKKI NEWS (MARCH 21) : World’s Happiest Countries index 2024 నివేదిక లో 143 దేశాలతో కూడిన జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ హ్యాపీనెస్‌ (International Day of Happiness) సందర్భంగా యూఎన్‌ ఆధారిత సంస్థ ర్యాంకులను విడుదల చేసింది.

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ మరోసారి అగ్ర స్థానంలో నిలిచింది. వరుసగా ఏడోసారి ఆ దేశం టాప్‌ ప్లేస్‌లో నిలిచింది.

జీవితంపట్ల సంతృప్తి, దేశ తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం వంటి అంశాల ఆధారంగా ప్రపంచంలోనే 143 దేశాలకు ర్యాంకింగ్‌లను నిర్ణయించినట్టు సంస్థ వెల్లడించింది.

ఈ రిపోర్ట్‌లో ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

ఈ జాబితాలో చైనా (60), నేపాల్‌ (93), పాకిస్థాన్‌ (108), మయన్మార్‌ (118) దేశాలు మనకంటే ముందుస్థానాలో నిలిచాయి. 2020లో తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్థాన్‌ ఈ జాబితాలో చిట్టచివరి స్థానం (143)లో నిలిచింది. కోస్టారికా 12వ స్థానంలో, కువైట్‌ 13వ స్థానంలో నిలిచాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా 23వ స్థానం, జర్మనీ 24వ ర్యాంకులో నిలిచాయి.

★ టాప్‌ 10లో నిలిచిన దేశాలు

1) ఫిన్లాండ్
2) డెన్మార్క్‌
3) ఐస్‌లాండ్‌
4) స్వీడన్‌
5) ఇజ్రాయెల్‌
6) నెదర్లాండ్స్‌
7) నార్వే
8)లక్సెంబర్గ్
9)ఆస్ట్రేలియా