ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం

BIKKI NEWS (SEP. 18) : World Water Monitoring Day September 18th. ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 18న నిర్వహించబడుతుంది. నీరు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న ఉద్ధేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.

World Water Monitoring Day September 18th

2003లో అమెరికా యొక్క క్లీన్ వాటర్ ఫౌండేషన్ (ACWF) ప్రపంచ విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. దేశాలలోని నీటి వనరులను పునరుద్ధరించడానికి, రక్షించడానికి 1972, అక్టోబరు 18న యునైటెడ్ స్టేట్స్ దేశంలో ప్రవేశపెట్టిన పరిశుభ్ర నీటి చట్టం వార్షికోత్సవానికి గుర్తుగా ఒక నెలరోజుల ముందుగా సెప్టెంబరు 18న ఈ దినోత్సవం జరపాలని నిర్ణయించారు.

2006లో ఈ కార్యక్రమ సమన్వయం నీటి పర్యావరణ సమాఖ్య, అంతర్జాతీయ నీటి సంఘాలకు… ఆ తరువాత 2015, జనవరిలో ఎర్త్ ఎకో ఇంటర్నేషనల్‌కు అప్పగించబడింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు