Home > TODAY IN HISTORY > World Turtle Day : ప్రపంచ తాబేలు దినోత్సవం

World Turtle Day : ప్రపంచ తాబేలు దినోత్సవం

BIKKI NEWS : World Tuttle Day may 23rd. ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచ తాబేలు దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. తాబేళ్ళ మనుగడపై మానవ దృష్టి సారించడానికి, వాటిని సంరక్షించేలా ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.

World Tuttle Day may 23rd

1990లో అమెరికాలోని అమెరికన్ తాబేలు రెస్క్యూ అనే సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 2000లో మిస్ ఇ. రస్సెల్ ప్రపంచ తాబేలు దినోత్సవం ప్రారంభించాడు.

కాలిఫోర్నియాలోని మాలిబుకు చెందిన సుసాన్ టెల్లెం వరల్డ్ టర్టిల్ డే (ప్రపంచ తాబేలు దినోత్సవం) అనే పదాన్ని ట్రేడ్ మార్క్ చేశాడు. జంతువుల వేడుకలకు సంబంధించిన చేజ్ అనే పుస్తకంలో ఈ దినోత్సవం గురించి ప్రస్తావించబడింది.

ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకుంటారు.తాబేళ్ళు, తాబేళ్ళ బొమ్మలను చాలామంది ఒకరికొకరు ఇచ్చుకుంటారు. తాబేళ్ళ వంటి దుస్తులు లేదా ఆకుపచ్చ వేసవి దుస్తులు ధరించి వీధులలో ప్రచారం చేయడం. రహదారులపై చిక్కుకున్న తాబేళ్ళను కాపాడడం. తాబేళ్ళకు సంబంధించిన పరిశోధనలు జరపడం. పాఠశాలల్లో విద్యార్థులకు తాబేళ్ళ గురించి బోధించడం.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు