BIKKI NEWS (JUNE 19) : WORLD SICKLE CELL DAY JUNE 19th. చికెన్ సెల్ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూన్ 19న సికిల్ సెల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
WORLD SICKLE CELL DAY JUNE 19th
జన్యు లోపాల కారణంగా రక్తంలోని ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారం లేదా నెలవంక ఆకారంలో మారే ప్రక్రియనే సికిల్ సెల్ వ్యాధి అంటారు. ఆకారం మారిన ఎర్ర రక్త కణాల రక్తంలో సులభంగా ప్రవహించలేవు దీనివల్ల కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా , పోషకాల సరఫరా తగ్గుతుంది. ఈ వ్యాధికి మారణానికి కూడా దారి తీయవచ్చు.
తల్లిదండ్రుల్లో ఒక్కరికి సికెల్ సెల్ వ్యాధి ఉంటే పిల్లలకు సంక్రమించదు. తల్లిదండ్రులకు ఇద్దరికీ ఉంటే తర్వాతి తరానికి సంక్రమిస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో 77 లక్షల మంది సికెల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నారు.. ప్రతి సంవత్సరం మూడు లక్షల మంది శిశువులు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు.
ఈ వ్యాధి నివారణకు ఎముక మజ్జ మార్పిడి చికిత్స అవసరం అయితే దీనిని 16 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రమే చేస్తారు.
చరిత్ర నేపథ్యం
ఐక్యరాజ్యసమితి 2008 డిసెంబర్ లో సికెల్ సెల్ వ్యాధిని ప్రపంచ జన్యు సంబంధిత వ్యాధుల్లో ఒకటిగా గుర్తించింది. దీన్ని నివారించడానికి ప్రజల్లో అవగాహన కల్పించాలని తీర్మానించింది. ఈ మేరకు ప్రతి సంవత్సరం జూన్ 19న సికిల్ సెల్ దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానించింది. 2009 నుండి ఈ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్