Home > ESSAYS > RED CROSS DAY – ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం

RED CROSS DAY – ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం

BIKKI NEWS (MAY 08) : WORLD RED CROSS DAY ON MAY 8th. ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 8న నిర్వహించబడుతుంది. నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్‌ హెన్రీడూన్‌ హంట్‌ జయంతి రోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు.

వివిధ స‌మ‌స్య‌ల‌తో భాద‌ప‌డుతున్న వారికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమంది వాలంటీర్లు, అనేక స్వ‌చ్ఛంద సంస్థ‌లు సహాయం చేస్తున్నాయి. అలాంటివారందరి గౌర‌వార్ధంగా ఈ దినోత్స‌వం ఏర్పాటు చేయబడింది.

యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బాధితులను ఆదుకుని, ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా “రెడ్‌క్రాస్ సొసైటీ” అనే సేవా సంస్థ ఏర్పాటయింది. అంత‌ర్జాతీయ క‌మిష‌న్ శాంతికి ప్ర‌ధాన స‌హ‌కారిగా రెడ్‌క్రాస్‌ను ప్ర‌వేశపెట్టింది.

1934లో టోక్యోలో జరిగిన 15వ అంత‌ర్జాతీయ‌ స‌ద‌స్సులో రెడ్‌క్రాస్ ట్రూస్ సూత్రాలను ఆమోదించి, వాటిని ప్ర‌పంచ‌ వ్యాప్తంగా అనేక ప్రాంతాకు వ‌ర్తించేలా అమ‌లు చేశారు. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్‌ హెన్రీడూన్‌ హంట్‌ జయంతిని ప్ర‌పంచ రెడ్‌క్రాస్ దినోత్స‌వంగా జ‌రుపుకునే ప్ర‌తిపాద‌న‌ 1948, మే 8న ఆమోదించబడింది. 1984లో అధికారికంగా ప్ర‌పంచ రెడ్‌క్రాస్ రెడ్ క్రెసెంట్ దినోత్సవంగా మార్చబడింది.