BIKKI NEWS (SEP. 27) : world Rabies day celebrations in gjc sangem. ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సంగెంలో ప్రిన్సిపాల్ మాధవరావు ఆధ్వర్యంలో… మండల స్థానిక వెటర్నరీ డాక్టర్ వల్లే రాజు కళాశాలలో విద్యార్తిని, విద్యార్థులకు రేబిస్ వ్యాధి వల్ల కలిగే పరిణామాలు అందుకు సంబంధించి ముందస్తూ ప్రజలు జంతువుల పట్ల ప్రదానంగా కుక్కకాటు వల్ల రేబిస్ వ్యాధి ఎలా సంక్రామిస్తుంది మనకు తెలియకుండా రేబిస్ వ్యాధి లక్షనాలు ఎలా ఉంటాయనే అంశాల పట్ల విద్యార్థులకు చాలా వివరంగా తెలియచేసారు.
world Rabies day celebrations in gjc sangem
మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజలు జంతు సంరక్షణ పట్ల వాటి వల్ల మానవుని పరస్పర సంబంధం పట్ల అవగాహనా కలిగి ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాధవరావు, గ్రంధపాలకులు రాజకుమార్, అధ్యాపకులు బుచ్చి రెడ్డి, కుమారస్వామి, యాక సాయిలు, నాగరాజు,అనిల్ కుమార్,రాఖీ, మాధవి, సుధీర్ కుమార్, అక్రమ్ అలీ,కార్తీక్, రమాదేవి, విద్యార్తిని, విద్యార్థులు పాల్గొన్నారు..