INDIA POPULATION 170 CRORE – ఐరాస నివేదిక

BIKKI NEWS (JULY 13) : WORLD POPULATION PROSPECTS 2024 REPORT BY UNO. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2024 ప్రకారం జనాభా అంచనాలను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. ఇందులో పలు ఆశ్యర్యకర విషయాలు వెల్లడించింది.

WORLD POPULATION PROSPECTS 2024 REPORT BY UNO

ప్రస్తుతం ప్రపంచ జనాభా 820 కోట్లు ఉండగా… వచ్చే 50 – 60 ఏళ్ళలో ఇది 1030 కోట్లకు చేరనుంది. శతాబ్దం చివరి నాటికి ఇది తగ్గుతూ… 1020 కోట్లకు చేరనుంది.

జనాభా తగ్గుదలకు ప్రధాన కారణం సంతాన సాఫల్యత రేటు పడిపోవడమే అని తెలిపింది. ప్రస్తుతం ప్రస్తుతం సంతాన సాఫల్యత రేటు 2.25 గా ఉంది.

భారతదేశ జనాభా ప్రస్తుతం 145 కోట్లుగా ఉంది. ప్రపంచంలోనే అత్యదిక జనాభా గల దేశం గా ఉంది. ఈ శతాబ్దం మొత్తం భారత్ జనాభాలో మొదటి స్థానంలోనే ఉండనుంది. 2054 నాటికి భారత జనాభా 169 కోట్లకు చేరనుంది. అనంతరం క్రమంగా తగ్గుతుంది. అయితే 2060 నాటికి 170 కోట్లకు చేరనుంది. తర్వాత 12% వార్షిక తగ్గుదలతో జనాభా రేటు తగ్గనుంది.

సగానికి పడిపోనున్న చైనా జనాభా

చైనా జనాభా ప్రస్తుతం 141 కోట్లుగా ఉంది. 2054 నాటికి 121 కోట్లకు చేరనుంది. 2100 నాటికి గరిష్ట తగ్గుదలతో చైనా దేశ జనాభా 63 కోట్లకు చేరనుంది. ఇది 1950 లో చైనా దేశ జనాభాతో సమానం కావడం విశేషం. శతాబ్దం చివరి నాటికి చైనా జనాభా కు భారత జనాభా రెట్టింపు కానుంది.

2024 – 2054 మధ్య చైనా జనాభాలో 20 కోట్లు జపాన్ జనాభాలో రెండు కోట్లు రష్యా జనాభాలో కోటి మంది తగ్గనున్నారు.

జనాభాలో మూడో స్థానంలో ఉన్న అమెరికా 2054 నాటికి నాలుగో స్థానానికి పడిపోనుంది. మూడో స్థానంలోకి పాకిస్తాన్ 38.9 కోట్ల జనాభాతో రానుంది

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు