HPPINESS INDEX 2023 : సంతోషకర దేశాల సూచిక

హైదరాబాద్ (మార్చి – 21) : యూఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అంతర్జాతీయ ఆనంద దినోత్సవమైన సోమవారం (మార్చి 20న) తన సంతోషకర దేశాల సూచిక (world happiness index 2023) ను విడుదల చేసింది.

world happiness index 2023

తాజా ర్యాంకింగ్ లలో ఫిన్లాండ్ ఎప్పటి మాదిరిగానే అత్యంత సంతోషకరమైన దేశాల్లో అగ్రభాగాన నిలిచింది. ఆరుదఫాలుగా అదే స్థానంలో కొనసాగుతోంది.

‘ప్రపంచంలోని 150కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకునే గ్లోబల్ సర్వే డేటా ఆధారంగా రూపొందించిన నివేదిక ఇది. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్ (1), డెన్మార్క్ (2), ఐస్లాండ్ (3) వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. చివరి స్థానాలలో ఆఫ్ఘనిస్థాన్ (146), జింబాబ్వే (145) , రువాండా (144) నిలిచాయి.

భారత్ 136వ స్థానంలో నిలిచింది. అయితే పాకిస్థాన్ (103) నేపాల్ (85) , చైనా(82), బంగ్లాదేశ్ (99) , శ్రీలంక (126), మయన్మార్ (123) దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు