Home > ESSAYS > ప్రపంచ ఎడారీకరణ కరవు కట్టడి దినోత్సవం

ప్రపంచ ఎడారీకరణ కరవు కట్టడి దినోత్సవం

BIKKI NEWS (JUNE 17) : World Day to Combat Desertification and Drought ఎడారీకరణ, భూ క్షీణత, కరవు పరిస్థితుల గురించి సమాజంలో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి ఏడాది జూన్ 17న ‘ప్రపంచ ఎడారీకరణ – కరవు కట్టడి దినోత్సవం’గా జరుపుకుఃటారు.

World Day to Combat Desertification and Drought

మానవ కార్యకలాపాల కారణంగా భూమి, నీరు, గాలి కాలుష్యం బారిన పడుతున్నాయి. అడవుల నరికివేత కారణంగా జీవవైవిధ్యం దెబ్బతింటుంది. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు పెరుగుతున్నాయి.

ఎడారీకరణను ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలు, నేల సారాన్ని పెంచే ప్రయత్నాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చరిత్ర

1992లో బ్రెజిల్ లోని రియో డి జెనిరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్ లో స్థిర అభివృద్ధికి ఎడారీకరణ, కరవు ప్రధాన అవరోధాలుగా గుర్తించారు. దీనికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) 1994, జూన్ 17న యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ (యూఎన్సీసీడీ)ని నెలకొల్పింది. ఐరాస ప్రపంచవ్యాప్తంగా ఏటా అదే తేదీన ‘ప్రపంచ ఎడారీకరణ – కరవు కట్టడి దినోత్సవం’గా జరుపుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ (యూఎన్సీసీడీ) 2024 నివేదిక ప్రకారం, 1990-2020 77.6% భూమి పొడి వాతావరణ పరిస్థితులకు లోనైంది.

ఇస్రో – ఎడారీకరణ భూక్షీణత అట్లాస్ ప్రకారం, దేశ భౌగోళిక విస్తీర్ణంలో 29.7% ఎడారీకరణకు, భూక్షీణతకు గురైంది.

అధికారిక గణాంకాల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 25 ప్రధాన కరవులు సంభవించాయి.

World Day to Combat Desertification and Drought 2025 Thene Restore the land – Unlock the opportunities.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు