BIKKI NEWS (APRIL 20) : WORLD CYBER CRIME INDEX 2024 REPORT – ప్రపంచ సైబర్ నేర నివేదిక 2024 ప్రకారం భారతదేశం దాదాపు 100 దేశాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది.
సైబర్ క్రైమ్ కింద వివిధ రకాల ఆన్లైన్ మోసాలను క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ర్యాన్సం వేర్, ముందస్తు ఆన్లైన్ పేమెంట్స్ వంటి నేరాల మీద 100 దేశాలలో పరిశోధించిన పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు.
భారత్ లో ఎక్కువగా ఈ సైబర్ నేరాలు ఎక్కువగా ముందస్తు పేమెంట్ల విభాగంలో జరుగుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
ఈ నివేదికలో అగ్రభాగంలో రష్యా ఉండడం విశేషం. తరువాత స్థానాలలో ఉక్రెయిన్ చైనా, అమెరికా, నైజీరియా మరియు రొమేనియా ఉన్నాయి.