Home > ESSAYS > WORLD BICYCLE DAY – ప్రపంచ సైకిల్ దినోత్సవం

WORLD BICYCLE DAY – ప్రపంచ సైకిల్ దినోత్సవం

BIKKI NEWS (JUNE 03) ‘: WORLD BICYCLE DAY JUNE 3rd. ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.

WORLD BICYCLE DAY JUNE 3rd

ప్రపంచ సైకిల్‌ దినోత్సవం కోసం 2016వ సంవత్సరం నుంచి ప్రపంచ సైక్లింగ్‌ అలయెన్స్‌ (డబ్ల్యూసీఏ), ఐరోపా సైక్లిస్ట్స్‌ సమాఖ్య (ఈసీఎఫ్‌)లు ఐక్యరాజ్య సమితిని విజ్ఞప్తి చేశాయి. 2018, ఏప్రిల్ 12న న్యూయార్క్‌లో 193 దేశాలు పాల్గొన్న ఐక్యరాజ్య సమితి 72వ సాధారణ సదస్సులో ఈ తీర్మానాన్ని ఆమోదించబడింది

ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితికి అందించేందుకు యునైటెడ్ స్టేట్స్ కి చెందిన ప్రొఫెసర్ లెస్జెక్ సిబిల్స్కి తన సోషియాలజీ తరగతితో కలిసి ఈ దినోత్సవ ప్రచారానికి నాయకత్వం వహించాడు. తుర్కమేనిస్తాన్ దేశంతోసహా 56 దేశాలు మద్దతు ఇచ్చాయి.

ఐక్యరాజ్య సమితి లోగోలోని నీలం, తెలుపు రంగులతో ప్రపంచ సైకిల్ దినోత్సవ లోగోని ఐజాక్ ఫెల్డ్ రూపొందించాడు. ప్రొఫెసర్ జాన్ ఇ. స్వాన్సన్ యానిమేషన్ చేసాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సైకిలిస్టులను సూచిస్తుంది. లోగో కింద #June3WorldBicycleDay అనే హ్యాష్‌ట్యాగ్ ఉంటుంది. ఈ సైకిల్ సమస్త మానవాళికి సేవ చేస్తుందని చూపించడం ఈ హ్యాష్‌ట్యాగ్ ముఖ్య ఉద్దేశ్యం.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు