BIKKI NEWS (MAY 20) : World Bee Day on MAY 20th. ప్రపంచ తేనెటీగల దినోత్సవం ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. జీవావరణవ్యవస్థలో తేనెటీగలు, ఇతర పరాగరేణు సంపర్క కారకాల పాత్రను గుర్తుచేసుకోవడంకోసం తేనెటీగల తొలి అధ్యాపకుడిగా, తొలి గ్రంథ రచయితగా పేరొందిన అంథొన్ జంసా గుర్తుగా ఆయన పుట్టినరోజున ఈ దినోత్సవం నిర్వహించబడుతోంది
World Bee Day on MAY 20th.
1934, మే 20న తేనెటీగల పెంపకంలో నిపుణుడైన అంథొన్ జంసా స్లొవేనియాలో జన్మించాడు. 2017, డిసెంబరులో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు, మే 20ను ప్రపంచ తేనెటీగ రోజుగా గుర్తించాలన్న స్లోవేనియా ప్రతిపాదనను అమోదించాయి. మానవాళికి ఎంతో మేలు చేసున్న తేనెటీగలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న ఉద్ధేశ్యంతో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. 2018, మే 20న తొలిసారిగా ప్రపంచ తేనెటీగ దినోత్సవం జరుపబడింది.
తేనెటీగల సంరక్షణ, యాజమాన్యం అనే అంశాలపై సదస్సులు నిర్వహిస్తారు.
క్షేత్ర పర్యటనలో భాగంగా తేనెటీగలను పెంచే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలో ప్రత్యక్షంగా చూపిస్తారు. తేనె తయారీ విధానం, తేనెలో ఉండే పోషక విలువలు వాటి ఆరోగ్య ప్రాధాన్యత, ప్యాకింగ్ మొదలైనవి నేర్పిస్తారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్